/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-62-1-jpg.webp)
Encounter : దండకారణ్యం మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. ఛత్తీస్‌గడ్(Chhattisgarh) లోని అబూజ్‌మడ్ అడవుల్లో మంగళవారం మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులు(Maoists), భద్రతా బలగాలకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో పదిమంది మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read : టీ20 వరల్డ్‌కప్ తర్వాత విరాట్, రోహిత్ రిటైర్‌మెంట్?
సమావేశమయ్యారనే సమాచారంతో..
అబూజ్‌మడ్ అడవుల్లో(Abujmarh Forests) మావోయిస్టులు సమావేశమయ్యారనే సమాచారంతో కూంబింగ్(Combing) చేపట్టాయి భద్రతాబలగాలు. ఈ క్రమంలోనే మావోయిస్టులు తారసపడగా నలుమూలలా చుట్టుముట్టిన స్పెషల్ పార్టీస్ ఒక్కసారిగా కాల్పులు జరపడంతో అక్కడికక్కడే పది మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. మంగళవారం ఉదయం నుంచి భద్రతాబలగాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కాంకేర్ ఎన్‌కౌంటర్ తర్వాత బస్తర్ రీజన్‌లో ఇదే మరో భారీ ఎన్‌కౌంటర్ గా అధికారులు పేర్కొన్నారు. ఇక మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్రం అడుగులు వేస్తున్న నేపథ్యంలో బలగాలు అడవులను జల్లడపడుతున్నాయి.