Jammu And Kashmir : జమ్మూలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదుల మధ్య మళ్ళీ ఎదురుకాల్పులు..ఒక జవాన్‌కు గాయాలు

జమ్మూ కాశ్మీర్‌లో వరుసగా మళ్ళీ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. మూడురోజుల వ్యవధిలో ఇది నాలుగోసారి. నిన్న ఎన్‌కౌంటర్‌లో ఒక జవాన్ గాయపడ్డారు. దోడాలోని టాంటా ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.

New Update
 Jammu-Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో కాల్పులు..ముగ్గురు ఉగ్రవాదులు మృతి

Encounter Between Indian Army and Terrorists : నిన్న కథువా... ఈరోజు దోడా.. వరుసగా ఉగ్రవాదులు (Terrorists), భారత భద్రతా దళాల మధ్య ఎదురు కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. దోడా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉననారనే సమాచారం అందడంతో భద్రతా బలగాలు అక్కడికి చేరుకున్నాయి. దీంతో ఇద్దరి మధ్యా కాల్పులు జరిగాయి. ఇందులో ఒక స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) సైనికుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఎన్‌కౌంటర్‌లో భారత సైన్యం తాలూకా రాష్ట్రీయ రైఫిల్స్ , జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులతో (Jammu & Kashmir Police) కలిసి సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇక గత 24 గంటల్లో ఇది మూడో ఎన్‌కౌంటర్. మంగళవారం జ్మూ డివిజన్‌లోని దోడా, కథువా జిల్లాల్లో ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఆర్మీ పోస్ట్‌పై ఉగ్రవాదులు దాడి చేయడంతో ఐదుగురు సైనికులు, ప్రత్యేక పోలీసు అధికారి (SPO) గాయపడ్డారు. మరోవైపు కథువాలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అంతేకాదు కథువా కాల్పుల్లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) సైనికుడు ఒకరు మరణించారు. అంతకు ముందు ఆదివారం జూన్ 9న రియాసీలో యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు.

జోడాలోని దోడా ప్రాంతం అంతా ఎత్తైన ప్రదేశాలను కలిగి ఉంటుంది. ఇలాంటి చోట్ల ఉగ్రవాదులు దాక్కుని కాల్పులు చేస్తున్నారు. వారిని మట్టుబెట్టేందుకు భారత ఆర్మీ ఆపరేషన్ కొనసాగిస్తోంది. దాంతో పాటూ దోడా ప్రాంతలోని చటర్‌గల్లా, గుల్దండి, సర్థాల్, శంఖ్ పాడేర్ మరియు కైలాష్ పర్వత శ్రేణులలో ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు. భదర్వా-పఠాన్‌కోట్ అంతర్రాష్ట్ర రహదారిపై ట్రాఫిక్ కదలికల్ని పూర్తిగా నిలిపేశారు. ఇదిలా ఉంటే రాజౌరీ జిల్లాలోని నౌషేరా సెక్టార్‌లో కలాల్ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తుల అనుమానాస్పద కదలికల నేపథ్యంలో అధికారులు కార్డన్ ఆపరేషన్ ప్రారంభించారు.

Also Read:Pm Modi: కువైట్ అగ్ని ప్రమాదంపై ప్రధాని మోదీ సమీక్ష..బాధితులకు అండగా ఉంటామని హామీ

Advertisment
తాజా కథనాలు