Encounter: దండకారణ్యంలో తుపాకుల మోత.. ఇద్దరు మృతి! దండకారణ్యం మరోసారి తుపాకుల మోతతో దద్దరిల్లింది. మార్చి 24న తెలంగాణ బంద్‌కు మావోయిస్టులు పిలుపునివ్వగా పిడియా అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు భద్రతా బలగాలు తెలిపాయి. By srinivas 24 Mar 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి Maoist: దండకారణ్యం మరోసారి తుపాకుల మోతతో దద్దరిల్లింది. శనివారం పోలీసులు, మావోయిస్టులకు మధ్య భీకరపోరు జరిగింది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు కాల్పులతో విరుచుకుపడ్డారు. కొన్ని గంటలపాటు జరిగిన యుద్ధంలో ఇద్దరు నక్సలైట్లు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మార్చి 24న తెలంగాణ బంద్.. ఈ మేరకు బీజాపూర్-దంతెవాడ జిల్లాల సరిహద్దులోని పిడియా అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులు మార్చి 24న తెలంగాణ బంద్‌కు పిలుపునివ్వగా పిడియా అటవీ ప్రాంతంలో పెద్దఎత్తున నక్సల్స్ సమావేశమైనట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలో డీఆర్జీ, బస్తర్ ఫైటర్స్, కోబ్రా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. అయితే దంతెవాడ-బీజాపూర్ సరిహద్దులో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ బాంబులపై జవాన్లు రాకేష్‌కుమార్ మర్కం, వికాస్‌కుమార్ పొరపాటున కాలు వేయడంతో అవి పేలిపోయి తీవ్రంగా గాయపడ్డారు. ఇది కూడా చదవండి: Moscow Attack: మాస్కో ఉగ్రదాడి ఘటనలో 11 మంది అరెస్ట్ మావోయిస్టులు మృతి.. అనంతరం బలగాలు మరింత ముమ్మరంగా కూంబింగ్ కొనసాగించాయి. ఈ క్రమంలోనే పోలీసులు ఎదురపడిన మావోయిస్టు దళాలు కాల్పులకు పాల్పడ్డాయి. భద్రతా బలగాలూ ఎదురుకాల్పులు జరపడంతో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందగా మిగిలిన వారు పారిపోయారని పోలీసు అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో పేలుడు పదార్థాలు, ఆయుధాలు, కిట్ బ్యాగులు, విప్లవ సాహిత్యం లభించిందని, మృతుల వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు భధ్రతా బలగాలు వెల్లడించాయి. #encounter #dandakaranyam #naxals-killed మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి