రూ. 56,900 జీతం.. 10వేలకు పైగా ఖాళీలు.. EMRS నోటిఫికేషన్లపై ఓ లుక్కేయండి..ఛాన్స్ మిస్‌ చేసుకోవద్దు!

టీచింగ్‌ని కెరీర్‌గా ఎంపిక చేసుకునే వారికి ఇది గుడ్‌న్యూస్‌. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS)లో మొత్తం 10వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్‌ కొనసాగుతోంది. ఆగస్టు 18వరకు అప్లికేషన్‌ సబ్మిట్ చేసుకునే డేట్‌ని పొడిగించారు. ల్యాబ్‌ అటెండర్‌, అకౌంటెంట్, JSA..ఇలా వివిధ రకాల ఉద్యోగాలకు అప్లై చేసుకునే అవకాశముంది.

రూ. 56,900 జీతం.. 10వేలకు పైగా ఖాళీలు.. EMRS నోటిఫికేషన్లపై ఓ లుక్కేయండి..ఛాన్స్ మిస్‌ చేసుకోవద్దు!
New Update

దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS)లో స్టాఫ్ రిక్రూట్‌మెంట్ కోసం భారీ నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే. రెండు వేర్వేరు నోటిఫికేషన్‌లతో మొత్తం 10,391 బోధన , బోధనేతర సిబ్బందిని భర్తీ చేయడానికి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. జూన్ నెలాఖరున 4,062 పోస్టులకు తొలి నోటిఫికేషన్ విడుదల అవ్వగా.. దరఖాస్తులను సబ్మిట్ చేసే గడువును ఈ నెల 18 వరకు పొడిగించారు. ఇదే సమయంలో 6 వేలకు పైగా పోస్టుల భర్తీకి మరో భారీ నోటిఫికేషన్ వెలువడింది. ట్రైబల్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (NESTS) ట్రైన్డ్ గ్రాడ్యుయేషన్ టీచర్ (TGT)తో సహా మొత్తం 6,329 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు https://emrs.tribal.gov.in/ వెబ్‌సైట్‌ను విజిట్‌ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు.

➼ ఉద్యోగ ఖాళీలు.. శిక్షణ పొందిన గ్రాడ్యుయేట్ టీచర్స్ (TGT) ఖాళీలు 5,660.

➼ సబ్జెక్ట్ వారీగా హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్, సైన్స్, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మణిపురి, మరాఠీ, ఒడియా, తెలుగు, ఉర్దూ, మిజో, సంస్కృతం, సంతాలి , సంగీతం, కళ, PTT, PET, లైబ్రేరియన్.

➼ ఇవి కాకుండా సంగీతం(music), కళ(arts), పీఈటీ లైబ్రేరియన్ విభాగంలో బీఈడీతో సంబంధం లేకుండా ఖాళీలను భర్తీ చేస్తారు. అంతేకాదు హాస్టల్ వార్డెన్ పురుషుల విభాగంలో 335, మహిళా విభాగంలో 334 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

➼ టీజీటీ ఖాళీల కోసం అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈడీతోపాటు సీఈటీ ఉత్తీర్ణులై ఉండాలి. TGT PET పోస్టులకు డిగ్రీ, BPED; TGT లైబ్రేరియన్ పోస్టులకు డిగ్రీ, BLISC ఉత్తీర్ణులై ఉండాలి. హాస్టల్ వార్డెన్ పోస్టులకు ఏదైనా డిగ్రీ చదివితే సరిపోతుంది. టీజీటీ పోస్టులకు 1500; హాస్టల్ వార్డెన్ రూ.1000. SC/ST/PWD అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

➼ OMR ఆధారిత (పెన్ పేపర్) విధానంలో ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు అడుగుతారు. TGT రాత పరీక్షకు 120 మార్కులు (120 ప్రశ్నలు), లాంగ్వేజ్‌ టెస్టుకు 30 మార్కులు (30 ప్రశ్నలు). హాస్టల్ వార్డెన్ రాత పరీక్షకు 120 మార్కులు (120 ప్రశ్నలు) కేటాయించారు. TGT పరీక్ష వ్యవధి మూడు గంటలు ఉంటుంది. హాస్టల్ వార్డెన్ పరీక్ష రెండున్నర గంటలుంటుంది.

➼ నోటిఫికేషన్‌ ప్రకారం.. అకౌంటెంట్ ఉద్యోగాలకు డిగ్రీ విద్యార్హత ఉంటే చాలు. వయసు 30 ఏళ్లు మించకూడదు. నెలకు రూ.35,400-రూ.1,12,400 చెల్లిస్తారు. JSA ఉద్యోగాలకు సీనియర్ సెకండరీ ఉత్తీర్ణత సరిపోతుంది. వయసు 30 ఏళ్లు మించకూడదు. రూ.19,900-రూ.63,200 చెల్లిస్తారు. ల్యాబ్ అటెండర్ ఉద్యోగాలకు 10వ/12వ తరగతి ఉత్తీర్ణత సరిపోతుంది. జీతం రూ.18,000 నుంచి రూ.56,900 వరకు ఉంటుంది.

#jobs #teaching-jobs #emrs-jobs
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe