మీరు ఆరోగ్యంగా ఉన్నారా..అయితే బోనస్‌ ఇస్తాం..శాలరీ కూడా పెంచుతాం!

చైనాలోని ఓ పేపర్‌ కంపెనీ తమ కంపెనీ ఉద్యోగులకు ఓ వినూత్నమైన ఆఫర్‌ ని ప్రకటించింది. వారు ఎంత ఫిట్ నెస్‌ గా ఉంటారో దానిని బట్టి వారికి బోనస్‌ ఇస్తామని ప్రకటించింది. దీంతో ఉద్యోగులు తమ ఆరోగ్యంతో పాటు బోనస్‌ కూడా లభిస్తుండడంతో సంతోషిస్తున్నారు.

మీరు ఆరోగ్యంగా ఉన్నారా..అయితే బోనస్‌ ఇస్తాం..శాలరీ కూడా పెంచుతాం!
New Update

సాధారణంగా కంపెనీలు తమ సంస్థకు లాభాలు వస్తేనో...లేక పండుగల సమయంలోనో తమ సంస్థల్లో ఉన్న ఉద్యోగులకు బోనస్‌ లు ఇవ్వటం జరుగుతుంది. ఆ బోనస్‌ అనేది సంస్థకు వచ్చిన లాభాలా బట్టో..లేక ఉద్యోగి జీతభత్యాల మీదో ఆధారపడి ఉంటుంది. కానీ ఇక్కడ ఓ కంపెనీ మాత్రం తమ కంపెనీ ఫిట్‌ నెస్‌ ని ఆధారంగా చేసుకుని బోనస్‌ లు ఇస్తానని ప్రకటించింది.

ఇంతకీ ఆ కంపెనీ ఏంటి? ఎక్కడుంది తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే... చైనాలోని డాంగ్‌పో పేపర్ కంపెనీ ఉద్యోగులకు వారి ఫిట్‌నెస్‌ సామర్థ్యాన్ని బట్టి బోనస్‌ ఇస్తామని ప్రకటించింది. దీంతో ఉద్యోగులందరూ కూడా తమ ఫిట్‌నెస్‌ మీద దృష్టిపెట్టారు. ఎలాగైనా ఫిట్‌ గా ఉండి కంపెనీ నుంచి ఎక్కువ బోనస్‌ తీసుకోవచ్చనే ఆలోచనలో ఉన్నారు.

చైనాలోని గ్వాంగ్‌డాండ్‌ ప్రావిన్స్‌ లో డాంగ్‌ పో పేపర్‌ కంపెనీ తన కంపెనీ ఉద్యోగులకు బోనస్‌ ప్రకటించే విషయంలో ఓ అడుగు ముందుకు వేసింది. బోనస్‌ ఇవ్వడానికి కంపెనీ సిద్దమే కానీ కండిషన్స్‌ అప్లై అంటూ తెలిపింది. ఇంతకీ ఆ కండిషన్స్‌ ఏంటో తెలుసా.. ప్రతి ఉద్యోగి కూడా ఆరోగ్యంగా ఉండడంతో పాటు నెల లోపు 50 కిలోమీటర్ల్ఉ పరిగెత్తితే వారు పూర్తి నెల జీతాన్ని బోనస్‌ గా అందుకుంటారని ప్రకటించింది.

అంతేకాకుండా 40 కిలో మీటర్లు పరిగెడితే 60 శాతం రివార్డ్‌, 30 కిలో మీటర్లు పరిగెడితే 30 శాతం బోనస్‌..దీంతో పాటు 100 కిలోమీటర్లు కానీ పరుగు పెట్టినట్లయితే వారికి మరో 30 శాతం అదనపు బోనస్‌ కూడా లభిస్తుందని తెలిపారు. దీని వల్ల తమ కంపెనీ ఉద్యోగులు ఆరోగ్యంగా ఉండటం వల్ల కంపెనీలో లీవ్స్ అనేవి తగ్గుతాయని..దీని వల్ల పని గంటలు కూడా పెరుగుతాయని కంపెనీ వివరించింది.

ఇలా కంపెనీ ఉద్యోగులు వాకింగ్‌కోసం ఉద్యోగుల ఫోన్‌లలో ఓ ప్రత్యేక యాప్‌ని కూడా ఏర్పాటు చేసి దాని ద్వారా గుర్తించనున్నట్లు వివరించింది. ఈ కొత్త విధానం వల్ల తమ ఫిట్ నెస్‌ పెరగడంతో పాటు బోనస్‌ కూడా లభించడంతో కంపెనీ ఉద్యోగులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Also read: మళ్లీ మాస్కులు పెట్టుకోండి.. కరోనా కేసులు, మరణాలతో వైద్యశాఖ మంత్రి అలర్ట్!

#china #fitness #bonus #paper-company
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe