Diwali Gifts: దీపావళి గిఫ్ట్స్ గా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు..ఉద్యోగులకు సర్‌ప్రైజ్ ఇచ్చిన యజమాని! తమిళనాడు కి చెందిన ఓ టీ ఎస్టేట్ యజమాని తన ఉద్యోగులకు దీపావళి కానుకగా రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్స్ అందించి వారిని సంతోషంలో ముంచెత్తాడు. By Bhavana 05 Nov 2023 in నేషనల్ వైరల్ New Update షేర్ చేయండి దీపావళి వస్తుందంటే చాలు..కంపెనీల వారు ఇచ్చే బోనస్ ల కోసం ఉద్యోగులు ఆశగా ఎదురు చూస్తుంటారు. కంపెనీలు ఇచ్చే బోనస్ లతో చాలా మంది పండుగను జరుపుకుంటారంటే...అతిశయోక్తి కాదు. నిన్న కాక మొన్న ఓ ఫార్మా కంపెనీ యజమాని తన ఉద్యోగులకు కార్లను గిఫ్ట్ గా ఇచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. తాజాగా తమిళనాడు (Tamilanadu) కి చెందిన ఓ టీ ఎస్టేట్(Tea estate) యజమాని తన ఉద్యోగులకు దీపావళి కానుకగా రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్స్(Royal en field Bikes) అందించి వారిని సంతోషంలో ముంచెత్తాడు. వివరాల ప్రకారం..కోటగిరి పట్టణంలోని ఓ టీ ఎస్టేట్ యజమాని శివకుమార్ తన ఉద్యోగులకు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ లను దీపావళి బోనస్ గా అందించారు. బైక్ లను ఇవ్వడమే కాకుండా వారితో కలిసి రైడ్ కి కూడా వెళ్లాడు. టీ ఎస్టేట్ యజమాని ఏకంగా రెండు లక్షల రూపాయలకు పైగా విలువ చేసే బైక్ లను అందించారు. టీ ఎస్టేట్‌లో గత రెండు దశాబ్దాలుగా 627 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.తన మేనేజర్, సూపర్‌వైజర్, స్టోర్ కీపర్, క్యాషియర్, ఫీల్డ్ స్టాఫ్, డ్రైవర్‌లతో సహా 15 మంది ఉద్యోగులకు బైక్‌లను బహుమతిగా ఇచ్చారు. టీ ఎస్టేట్ అభివృద్ధికి బాగా పనిచేసిన వారికి కొత్త బైక్ లు ఇవ్వడంతోపాటు ఉద్యోగులతో కలిసి నవంబర్ 12వ తేదీన తాము దీపావళి జరుపుకుంటున్నామని టీ ఎస్టేట్ అధినేత శివకుమార్ చెప్పారు. హర్యానాలోని పంచకులలోని ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీ యజమాని తన ఉద్యోగులకు దీపావళి కానుకగా కార్లను బహుమతిగా ఇచ్చిన వార్త సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. కంపెనీకి చెందిన ఉద్యోగులు ఎప్పటిలాగానే ఆఫీస్‌కు వెళ్లారు. తమ సీట్లలో కూర్చున్నారు. ఆఫీస్‌లో చాలా మంది ఉన్నారు కానీ.. వారిలో కొన్ని సీట్లలో మాత్రం ఏవో తాళాలు కనిపించాయి. అందరూ ఆశ్చర్యపోయారు. ఈ ‘కీ’స్ ఏంటని ఆరా తీశారు. ఇంతలోనే బాస్ వచ్చాడు. వారందరిని బయటకు తీసుకెళ్లాడు. అక్కడ మొత్తం 12 కార్లు ఉన్నాయి.. వాటికి క్లాత్ కప్పి ఉంది. 12 మందితో కార్లపై కవర్స్‌ను తీపించారు. వారందరికి ఆ కార్లను గిఫ్ట్ ఇచ్చారు. దీంతో ఆ 12మంది ఉద్యోగుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. విశేషం ఏంటంటే.. ఈ కార్లు గిఫ్ట్ తీసుకున్నవారిలో ఆఫీస్ బాయ్ కూడా ఉన్నాడు. దీపావళి బహుమతిని అందుకున్నవారిలో ఆఫీస్ బాయ్ కూడా ఉండడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆఫీస్ బాయ్ నిబద్ధతగా పని చేసినందుకు అతనికి కూడా కారు గిఫ్ట్ ఇవ్వడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కంపెనీల్లో మేం జాయిన్ అయినా బాగుండేది కదు అని కామెంట్లు పెడుతున్నారు. Also read: నాకు పెళ్లి చేస్తేనే ఎన్నికల విధులకు వస్తా..ఓ టీచర్ వింత కోరిక! #tamilanadu #surprise #royal-enfield-bikes #diwli-gifts మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి