AP News: ఆ ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు.. ఏపీ కోర్టులో సంచలన తీర్పు

ఏలూరులో మహిళపై యాసిడ్‌ దాడికి తెగబడిన కేసులో ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు. ఏలూరు జిల్లా ఎస్సీ, ఎస్టీ స్పెషల్‌ కోర్టు న్యాయమూర్తి ఎం.సునీల్‌కుమార్‌ సంచలన తీర్పు వెలువరించారు.

New Update
AP News: ఆ ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు.. ఏపీ కోర్టులో సంచలన తీర్పు

Eluru: ఏలూరులో మహిళపై యాసిడ్‌ దాడికి తెగబడిన కేసులో ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు. ఏలూరు జిల్లా ఎస్సీ, ఎస్టీ స్పెషల్‌ కోర్టు న్యాయమూర్తి ఎం.సునీల్‌కుమార్‌ సంచలన తీర్పు వెలువరించారు. యాసిడ్‌ దాడిలో (Acid Attack) ప్రాణాలు కోల్పోయిన ఎడ్ల ఫ్రాన్సికా కుటుంబానికి సత్వర న్యాయం అందిస్తూ ముగ్గురు నిందితులకు శిక్ష ఖరారు చేశారు. ఏలూరు‌ జిల్లాలో 35 ఏళ్ల మహిళపై యాసిడ్ దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముగ్గురు నిందితులు బోడ నాగ సతీష్, బెహరా మోహనం, ఉషా కిరణ్‌లను దోషులుగా నిర్దారించిన వారికి జీవిత ఖైదు విధిస్తూ బుధవారం (నేడు) తీర్పు వెలువరించింది. నేడు జిల్లా ఎస్పీ డి.మేరీ ప్రశాంతి మీడియాకు వివరాలు వెల్లడించారు. ఏలూరు కొత్తగూడెం ప్రాంతానికి చెందిన ప్రధాన నిందితుడు బోడ నాగసతీకు జీవిత ఖైదుతోపాటు రూ.10 వేల జరిమానా, బెహరా మోహన్, బూడిద ఉషాకిరణ్‌కు జీవిత ఖైదుతోపాటు రూ.15 వేల చొప్పున జరిమానా విధించారు. యాసిడ్‌ విక్రయించిన కొల్లా త్రివిక్రమరావుకు రూ.1,500 జరిమానా విధించారు.

ఇలా దాడి జరిగింది

మృతురాలు ఫ్రాన్సికా కుటుంబ కలహాలతో భర్తకు దూరంగా ఉంటోంది. నగరంలోని ప్రైవేట్‌ దంత వైద్యశాలలో రిసెప్షనిస్ట్‌గా ఫ్రాన్సికా పనిచేస్తోంది. అయితే..సోదరితో బోడ నాగసతీష్‌ సన్నిహితంగా ఉంటున్నాడని ఫ్రాన్సికా వ్యతిరేకించింది. దీంతో ఫ్రాన్సికాను హతమార్చేందుకు కక్ష పెంచుకున్న సతీష్‌ ఉషాకిరణ్‌, మోహన్‌లకు సుపారీ ఇచ్చాడు. ఈ ఏడాది జూన్‌ 13న రాత్రి 8.30 గంటల సమయంలో వారిద్దరూ ఫ్రాన్సికాపై యాసిడ్‌తో దాడి చేశారు. గాయపడిన ఫ్రాన్సికాను మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి చేర్పించగా.. 8 రోజులపాటు మృత్యువుతో పోరాడిన జూన్‌ 21న ఆమె మరణించింది. మృతురాలు తల్లి ధనలక్ష్మి ఏలూరు దిశ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ ఇంద్ర శ్రీనివాస్‌ కేసు నమోదు చేశారు.

నిందితులకు కఠిన శిక్షలు 

జిల్లా ఎస్పి మేరి ప్రశాంతి మాట్లాడుతూ.. కేసు సత్వర విచారణ బాధ్యతను ఏలూరు డీఎస్పీ శ్రీనివాసులుకు డీజీపీ కేవీ రాజేంద్రనాద్‌రెడ్డి అప్పగించారు. కేవలం 21 రోజుల్లోనే నిందితుల్ని అరెస్ట్‌ చేసి చార్జ్‌ట్‌ దాఖలు చేశారు. దాడిపై పటిష్టమైన సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించారు. ఏలూరు జిల్లా ఎస్సీ, ఎస్టీ స్పెషల్‌ కోర్టు న్యాయమూర్తి సునీల్‌కుమార్‌ కేవలం 117 రోజుల్లోనే విచారణ పూర్తి చేసి దోషులకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చారు. ఈ కేసులో సాక్షులను ప్రవేశ పెట్టడంతో కీలకంగా వ్యవహరించిన దిశ సీఐ ఇంద్ర శ్రీనివాస్, డీసీఆర్‌బీ సీఐ దుర్గాప్రసాద్‌, విశ్వం, డీఎస్పీ శ్రీని­వాసులను జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి అభినందించారు. అంతేకాదు.. మహిళలపై దాడుల అంశాన్ని ప్రభుత్వం చాలా సిరియస్‌గా తీసుకుంది.

ఇది కూడా చదవండి: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్.. ఇకపై 24 గంటల పాటు

Advertisment
తాజా కథనాలు