Twitter (X): ట్విట్టర్‌(ఎక్స్)లో ఇక బ్లాక్ చేయడం కుదరదు.. మస్క్ మరో సంచలన ప్రకటన

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్ కంపెనీని సొంతం చేసుకున్న దగ్గరి నుంచి రోజుకో మార్పులతో ముందుకొస్తున్నారు. ఇప్పటికే బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్, ట్విట్టర్‌ పేరును ఎక్స్‌గా మార్చడం, లోగోలు మార్చడం వంటి వాటితో వార్తల్లో నిలిచారు. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.

New Update
Twitter (X): ట్విట్టర్‌(ఎక్స్)లో ఇక బ్లాక్ చేయడం కుదరదు.. మస్క్ మరో సంచలన ప్రకటన

మస్క్ (Elon Musk) మరో సంచలన నిర్ణయం.. 

ప్రపంచంలో సెలబ్రెటీలందరూ ఎక్కువగా వాడే సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో ట్విట్టర్(ఎక్స్) ముందు వరుసలో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి ఒక్కరు తమ అభిప్రాయలను ట్విట్టర్ వేదికగా పంచుకుంటూ ఉంటారు. అలాంటి కంపెనీ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేతికి వచ్చిన దగ్గరి నుంచి అనేక మార్పులతో ముందుకెళ్తోంది. బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్, ట్విట్టర్‌ (Twitter) పేరును ఎక్స్‌(X)గా మార్చడం, లోగోలు మార్చడం వంటి నిర్ణయాలు తీసుకున్న మస్క్.. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ట్విట్టర్ ఎకౌంట్‌ను ఎక్కువగా సెలబ్రెటీలు వాడుతూ ఉంటారు. అయితే కొంతమంది నెటిజన్లు నుంచి వారు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. దీంతో అటువంటి వారి అకౌంట్ బ్లాక్ చేస్తూ ఉంటారు. ఈ ఫీచర్ ఎంతో మందికి బాగా ఉపయోగపడుతుంది.

publive-image

బ్లాక్ ఆప్షన్ తీసివేస్తున్నట్లు ప్రకటన..

ఇలాంటి అద్భుతమైన బ్లాక్ ఫీచర్‌ను త్వరలోనే తొలగించనున్నట్టు మస్క్ (Elon Musk) సంచలన ప్రకటన చేశారు. యాప్‌లో యూజర్లను బ్లాక్ చేయడం అర్థవంతంగా లేదని ఆయన అభిప్రాయం వ్యక్తంచేశారు. ఎవరైనా అకౌంట్ మ్యూట్ చేయడానికి లేదా బ్లాక్ చేయడానికి ఏమైనా కారణం ఉందా? మీ కారణాలను తెలియజేయండి అని టెస్లా ఓనర్స్ సిలికాన్ వ్యాలీ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌కు మస్క్ రిప్లై ఇస్తూ "బ్లాక్ త్వరలోనే ఓ ఫీచర్ గా తొలగింపునకు గురవుతోంది. డీఎం(డైరెక్ట్ సందేశాలు)లకు ఇందులో మినహాయింపు ఉంది" అని తెలిపారు. నిజానికి బ్లాక్ ఫీచర్ తనకు నచ్చడం లేదని మస్క్ గతంలోనే ప్రకటించారు. ఇప్పుడు ఆ దిశగా కార్యాచరణ ప్రకటించాఉర. మస్క్ తాజా ప్రకటనపై ట్విట్టర్ మాజీ సీఈవో జాక్ డోర్సే సానుకూలంగా స్పందిస్తూ మ్యూట్ ఆప్షన్ ఉండాలని సూచించించారు.

సెలబ్రిటీలకు కొత్త తలనొప్పి వచ్చినట్లే..

నిజంగా యూజర్ బ్లాక్ ఆప్షన్ ఎత్తివేస్తే రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలకు కొత్త తలనొప్పి వచ్చినట్లే. సెలబ్రెటీలు, రాజకీయ నేతలు తమ పోస్టులకు వ్యక్తిగత దూషణలు, వేధింపులు ఎదుర్కొంటూ ఉంటారు. ఇప్పుడు బ్లాక్ ఆప్షన్ తీసివేస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని టెక్నాలజీ నిపుణలు చెబుతున్నారు.

త్వరలోనే వీడియో కాల్ సదుపాయం.. 

ట్విట్టర్‌(ఎక్స్) యాప్‌లో వీడియో కాలింగ్ ఫీచర్ కూడా రానున్నట్లు ఎక్స్ సీఈఓ లిండా యకారినో ఇటీవల తెలిపిన సంగతి తెలిసిందే. ఎక్స్ యాప్‌లో త్వరలోనే వీడియో కాలింగ్ ఫీచర్ యాడ్ చేయనున్నట్లు ఆమె స్పష్టంచేశారు. యూజర్లు తమ ఫోన్ నంబర్ ఎవరికీ ఇవ్వకుండానే చాటింగ్, వాయిస్, వీడియో కాలింగ్ చేసుకునే ఆప్షన్ తీసుకురానున్నట్లు లిండా వెల్లడించారు.

Also Read: Jio ఫ్రీ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్, అన్‎లిమిటెడ్ డేటా..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు