Hyderabad : నగరవాసులుకు అలర్ట్‌.. ఆ రెండు రోజులు నీళ్లు బంద్‌!

హైదరాబాద్‌ మహానగరానికి తాగునీరు సరఫరా చేసే సింగూరు 3,4 ఫేజ్‌ లకు విద్యుత్‌ సరఫరా చేసే 123 కేవీ పెద్దాపూర్‌, కంది సబ్‌ స్టేషన్లలో టీజీ ట్రాన్స్ కో అధికారులు మరమ్మతులు చేపట్టనున్నారు. దీంతో రెండు రోజుల పాటు నగరంలో నీటి సరఫరా ఉండదని అధికారులు తెలిపారు.

Hyderabad : నగరవాసులుకు అలర్ట్‌.. ఆ రెండు రోజులు నీళ్లు బంద్‌!
New Update

Telangana : హైదరాబాద్‌ (Hyderabad) మహానగరానికి తాగునీరు సరఫరా (Drinking Water) చేసే సింగూరు 3,4 ఫేజ్‌ లకు విద్యుత్‌ సరఫరా (Electricity Supply) చేసే 123 కేవీ పెద్దాపూర్‌, కంది సబ్‌ స్టేషన్లలో టీజీ ట్రాన్స్ కో అధికారులు మరమ్మతులు చేపట్టనున్నారు. దీంతో గురువారం ఉదయం (జులై (4) )7 గంటల నుంచి మరుసటి రోజు అంటే శుక్రవారం 5 వ తేదీ శుక్రవారం ఉదయం 7 గంటల వరకు ఈ పనులు జరుగుతాయని, 24 గంటల పాటు రిజర్వాయర్ల పరిధిలో నీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని అధికారులు వివరించారు.

షేక్‌పేట, భోజగుట్ట రిజర్వాయర్‌ (లోప్రెజర్‌), జూబ్లీహిల్స్‌, సోమాజిగూడ, బోరబండ, బంజారాహిల్స్‌, ఎర్రగడ్డ, మూసాపేట, కేపీహెచ్‌బీ, హైదర్‌నగర్‌, నల్లగండ్ల, చందానగర్‌, హుడా కాలనీ, హఫీజ్‌పేట, మణికొండ, నార్సింగి తదితర ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందన్నారు.

Also read: పోలీసులపై మంత్రి భార్య చిందులు…సీఎం సీరియస్‌!

#hyderabad #electricity-supply #bandh #drinking-water
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe