Electric Scooter: కుర్రాళ్లకు కిరాక్ ఆఫర్..10వేల భారీ డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో అదిరే ఎలక్ట్రిక్ స్కూటర్..!!

ఫ్లిప్ కార్ట్ లో ఒకాయ ఎలక్ట్రిక్ స్కూటర్ పై కిరాక్ ఆఫర్ అందుబాటులోఉంది .ప్రీడమ్ ఎల్ఐ 2 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 75,899 ఉండగా..ఆఫర్ లో 65,899కే సొంతం చేసుకోవచ్చు. అంటే ఏకంగా రూ. 10వేల డిస్కౌంట్ పొందవచ్చు. ఇది పరిమితకాల ఆఫర్ మాత్రమే.

New Update
Electric Scooter: కుర్రాళ్లకు కిరాక్ ఆఫర్..10వేల భారీ డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో అదిరే ఎలక్ట్రిక్ స్కూటర్..!!

Okaya Electric Scooter: మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీకోసం ఓ అదిరే ఆఫర్ అందుబాటులోఉంది. భారీ డిస్కౌంట్ తో ఈ స్కూటర్ ను మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు ఈఎంఐ కూడా పెట్టుకోవచ్చు. ఇందులో ఫీచర్లు కూడా సూపర్ గా ఉన్నాయి. ఇంతకీ ఆ ఆఫర్ ఏంటి. ఎంత వరకు డిస్కౌంట్ వర్తిస్తుంది. ఎలా పొందాలి. ఇలాంటి అంశాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ప్రముఖ ఈకామర్స్ సంస్థలలో ఒకటైన ఫ్లిప్ కార్ట్ లో (Flipkart) ఒకాయ ఎలక్ట్రిక్ స్కూటర్ పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఫ్రీడమ్ ఎల్ఐ2 ఎలక్ట్రిక్ స్కూటర్ పై (OKAYA Freedum LI-2) అదిరిపోయే డిస్కౌంట్ ఉంది. ఈఎంఐ కూడా పెట్టుకోవచ్చు. ఒకాయ ఎలక్ట్రిక్ స్కూటర్‌ ధర రూ. 75,899 ఉండగా ఇప్పుడు మీరు దాన్ని రూ. 65,899కే సొంతం చేసుకోవచ్చు. అంటే ఏకంగా రూ. 10 వేల రూపాయల డిస్కౌంట్ వస్తోంది. ఏకంగా పదివేలు అంటే భారీ తగ్గింపు అని చెప్పుకోవచ్చు.అయితేఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమేనని గుర్తించుకోవాలి. అందువల్ల డీల్ ఉన్నప్పుడే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను సొంతం చేసుకోవడం బెస్ట్ . కాగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి చార్జింగ్ పెడితే 75 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. దీని టాప్ స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు ఉందని కంపెనీ పేర్కొంది. అంటే ఇది లోస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని అర్థం.

అటు ఈ స్కూటర్ చార్జింగ్ టైమ్ 5 గంటలు. ట్యూబ్‌లెస్ టైర్లు ఉంటాయి. ఇందులో బ్యాటరీ ఇండికేటర్, స్పీడో మీటర్, ట్యాకో మీటర్, ట్రిప్ మీటర్ కూడా ఉన్నాయి. ఎల్ఈడీ హెడ్‌లైట్స్ అమర్చడంతోపాటు టెలీస్కోపిక్ సస్పెన్షన్ ఉంది. రిమోట్ స్టార్ట్ అండ్ స్టాప్ ఫీచర్ కూడా ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఉంది. 3 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 25,300, ఆరు నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 12,650, ఇక 9 నెలల టెన్యూర్ ఎంచుకుంటే నెలకు రూ. 8434 కట్టాల్సి ఉంటుంది. ఇక 12 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 6325 చెల్లించాల్సిందే.

ఇది కూడా  చదవండి: వారసత్వ రాజకీయాలతో దేశానికి చాలా నష్టం.. మోదీ లాస్ట్ స్పీచ్!

ఇంకా రూ.35 వేల డౌన్ పేమెంట్ కడితే అప్పుడు నెలకు రూ. 1705 మేర ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ 24 నెలల టెన్యూర్ ఎంచుకోవాలి. ఇలా మీరు వడ్డీ భారం లేకుండా సులభ ఈఎంఐలో కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను మీరు కొనుగోలు చేయవచ్చు. అందువల్ల మీరు బడ్జెట్ ధరలోనే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకుంటే ఈ ఆఫర్ గురించి ఓ సారి పరిశీలించండి.

Advertisment
తాజా కథనాలు