Air Taxi: గాల్లో రయ్.. రయ్యంటూ గమ్యస్థానానికి.. ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ వచ్చేస్తోంది 

మనదేశంలో ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీలు తీసుకురావడానికి ఇండిగో విమానాల నిర్వహణ సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఎంటర్‌ప్రైజెస్, అమెరికాకు చెందిన 'ఆర్చర్ ఏవియేషన్'తో ఎగ్రిమెంట్ చేసుకుంది. ఎయిర్ టాక్సీలు అందుబాటులోకి వస్తే ప్రజలకు ట్రాఫిక్ సమస్యల నుంచి విముక్తితో పాటు సమయం కూడా కలిసి వస్తుంది.

Air Taxi: గాల్లో రయ్.. రయ్యంటూ గమ్యస్థానానికి.. ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ వచ్చేస్తోంది 
New Update

Electric Air Taxi: రోజూ ట్రాఫిక్ చక్రబంధంలో తిరుగుతూ ఉండే వారికి అబ్బ.. గాల్లో ఎగురుకుంటూ వెళ్ళిపోతే ఎంత బావుంటుంది? అనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి మహానగరాల్లో ఆఫీసులకు వెళ్లి రావడానికి తిప్పలు పడేవారికి గాల్లో ఎగిరే చిన్న విమానాలు ఉంటె భలే ఉంటుంది కదా అని ప్రతిసారీ అనిపిస్తుంది. ఇదిగో ఇలా అనిపించే వారికోసం ఒక శుభవార్త ఇక్కడ ఉంది. అదేమిటంటే గాల్లో ఎగురుతూ గమ్యస్థానాలను చేరిపోయే విధానంగా ఎలక్ట్రిక్-ఎయిర్ టాక్సీ (Electric Air Taxi) అందుబాటులోకి రాబోతోంది. 

భారతదేశంలో (India) మొదటి ఎలక్ట్రిక్-ఎయిర్ టాక్సీ 2026 నాటికి నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకోసం దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోను (IndiGo)  నిర్వహిస్తున్న ఇంటర్‌గ్లోబ్ ఎంటర్‌ప్రైజెస్, అమెరికాకు చెందిన 'ఆర్చర్ ఏవియేషన్'తో (Archer Aviation) భాగస్వామ్యం కుదుర్చుకుంది.

మెమోరాండంపై సంతకం చేసిన తర్వాత, రెండు కంపెనీలు  'ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ ఆపరేషన్ నియంత్రణ ఆమోదం - క్లియరెన్స్‌పై ఆధారపడి ఉంటుంది. దేశానికి విప్లవాత్మక రవాణా పరిష్కారాన్ని అందించడమే మా లక్ష్యం అంటూ ఒక ప్రకటన విడుదల చేశాయి. 

Also Read: Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఈ విషయాలను ఖచ్చితంగా తెలుసుకోండి..!!

ఆర్చర్స్ ఎలక్ట్రిక్ వెర్టికల్ టేకాఫ్ - ల్యాండింగ్ (eVTOL) మిడ్‌నైట్ ఎయిర్‌క్రాఫ్ట్ ద్వారా ఎయిర్ టాక్సీ సేవలు అందిస్తారు.  ఈ సర్వీసులు అందుబాటులోకి వస్తే రోడ్డుపై 90 నిమిషాల ప్రయాణంతో చేరుకునే గమ్యస్థానాన్ని 7 నిమిషాల్లో చేరుకోవచ్చు. 

మిడ్‌నైట్ ఎయిర్‌క్రాఫ్ట్ వేగంగా బ్యాక్-టు-బ్యాక్ విమానాలను నిర్వహించడానికి రూపొందించారు. ఇవి హెలికాప్టర్ల లానే నిలువుగా టేకాఫ్ - ల్యాండింగ్ చేయగల ఎలక్ట్రిక్ విమానాలు. వీటి టేకాఫ్ లాండింగ్ కోసం రన్‌వే అవసరం లేదు. 

అర్బన్ ఎయిర్ టాక్సీ (Air Taxi)సర్వీస్‌తో పాటు, లాజిస్టిక్స్, మెడికల్, ఎమర్జెన్సీ - చార్టర్ సర్వీస్‌ల కోసం ఎలక్ట్రిక్-ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఉపయోగించాలని కూడా యోచిస్తోంది.

మనదేశంలో ముఖ్యంగా నగర ప్రాంతాల్లో రోజు రోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ ఇబ్బందుల పరిష్కారానికి ఎయిర్ టాక్సీలు ఉపయోగపడే అవకాశం ఉంది. ఎయిర్ టాక్సీలు అందుబాటులోకి వస్తే ప్రజలకు ట్రాఫిక్ సమస్యల నుంచి వెసులుబాటుతో పాటు సమయం కూడా కలిసి వస్తుంది. అంతేకాకుండా, రోజు రోజుకూ పెరిగిపోతున్న వాతావరణ కాలుష్య నివారణకు కూడా ఈవిధమైన ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీలు ఉపయోగపడతాయని చెప్పవచ్చు.

Watch this interesting Video:

#air-taxi #indigo-airlines
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe