Air Taxi: గాల్లో రయ్.. రయ్యంటూ గమ్యస్థానానికి.. ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ వచ్చేస్తోంది
మనదేశంలో ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీలు తీసుకురావడానికి ఇండిగో విమానాల నిర్వహణ సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఎంటర్ప్రైజెస్, అమెరికాకు చెందిన 'ఆర్చర్ ఏవియేషన్'తో ఎగ్రిమెంట్ చేసుకుంది. ఎయిర్ టాక్సీలు అందుబాటులోకి వస్తే ప్రజలకు ట్రాఫిక్ సమస్యల నుంచి విముక్తితో పాటు సమయం కూడా కలిసి వస్తుంది.