Megha : సుప్రీంకోర్టు(Supreme Court) మొట్టికాయల తర్వాత రాజకీయ పార్టీ(Political Parties) లకు నిధులు సమకూర్చిన ఎన్నికల బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఎస్‌బీఐ(SBI) సమర్పించిన డేటాను వెబ్‌సైట్‌లో పెట్టింది. ఎస్‌బీఐ నుంచి వచ్చిన ఎన్నికల బాండ్ల సమాచారాన్ని మార్చి 15లోగా వెబ్‌సైట్‌లో పెట్టాలని మార్చి 12న సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో మొత్తం 763 పేజీలతో వివరాలు వెల్లడించింది. రెండు పార్ట్‌లుగా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. ఎవరు ఎన్ని బాండ్లు? ఎంత మొత్తానికి కొనుగోలు చేశారనే వివరాలు స్పష్టంగా తెలియజేసింది. ఎలక్టోరల్ బాండ్ల(Megha Electoral Bonds) వివరాలన్నీ పారదర్శకమని ఎలక్షన్ కమిషన్ తెలియజేసింది. మొదటి పార్ట్‌లో ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసిన వారి వివరాలను పొందుపరిచింది. రెండవ పార్ట్‌లో బాండ్లను ఎన్‌క్యాష్ చేసుకున్న పార్టీల వివరాలను తెలియజేసింది. వాటితో పాటు ఇచ్చిన తేదీలు, తీసుకున్న మొత్తాలకు సంబంధించిన వివరాలను స్పష్టంగా వెల్లడించింది.
1588 కోట్లతో మేఘా రికార్డు:
రాజకీయ పార్టీలకు అత్యధిక విరాళాలిచ్చిన టాప్ కంపెనీల్లో మేఘా ఇంజనీరింగ్ సంస్థ కూడా ఒకటి. వివిధ రాజకీయ పార్టీలకు రూ. 1588 కోట్లను విరాళంగా ఇచ్చింది మేఘా ఇంజనీరింగ్ కంపెనీ.
ఇక విరాళాల జాబితాలో టాప్ ప్లేస్‌లో ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్(Future Gaming & Hotel Services) సంస్థ నిలిచింది. వివిధ రాజకీయ పార్టీలకు దాదాపుగా రూ. 2177 కోట్లు విరాళంగా ఇచ్చింది. అత్యధికంగా బీజేపీకి రూ. 11562 కోట్ల విరాళాలు అందాయి. బీజేపీ(BJP) తరువాతి స్థానంలో తృణమూల్ కాంగ్రెస్(Congress) కు రూ.3214 కోట్ల విరాళాలు అందాయి. ఇక బీఆర్‌ఎస్(BRS) కు రూ. 2278 కోట్ల విరాళాలొచ్చాయి. వైసీపీ(YCP) కి రూ. 662 కోట్లు, టీడీపీకి రూ. 437 కోట్ల విరాళాలు అందాయి. మొత్తంగా టాప్ లిస్ట్‌లో తెలుగు రాష్ర్టాలకు సంబంధించిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ నిలిచింది.
Also Read : వైసీపీ ఫైనల్ లిస్ట్ డేట్ ఫిక్స్ చేసిన అధిష్టానం…ఎప్పుడు ..ఎక్కడ నుంచి అంటే!