Electoral Bonds Case: ఎలక్టోరల్ బాండ్స్ నిషేధిస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పు ఇచ్చిన సందర్భంగా సుప్రీం కోర్ట్ (Supreme Court) భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ)ని ఎలక్టోరల్ బాండ్శ్ కు సంబంధించి ఏప్రిల్ 12, 2029 నుంచి పూర్తి వివరాలను మార్చి 6వ తేదీలోగా కోర్టుకు అందచేయాలని స్పష్టంగా ఆదేశించింది. అయితే, దీనిపై ఎస్బీఐ తమకు జూన్ నెల వరకూ సమయం కావాలని సుప్రీం కోర్టును ఇటీవల అభ్యర్థిస్తూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై సుప్రీం కోర్టులో ఈరోజు (మార్చి 11) విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా ఎస్బీఐ (State Bank of India) గడువు కోరడాన్ని తప్పు పట్టింది కోర్టు.
ఈ సందర్భంగా ఎస్బీఐని తీవ్రంగా మందలించింది కోర్టు. "మీరు ఇలా పొడిగింపుతో ముందుకు రావడం చాలా తీవ్రమైన విషయం. మా తీర్పు చాలా స్పష్టంగా ఉంది" అంటూ జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈ సందర్భంగా తీవ్రంగా స్పందించారు.
Also Read: సమయం ఇవ్వండి.. ఎలక్టోరల్ బాండ్స్ వివరాలపై సుప్రీం కోర్టుకు ఎస్బీఐ అభ్యర్ధన
ఈ కేసు(Electoral Bonds Case)ను వాదిస్తూ, SBI తరపున హాజరైన సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, ప్రక్రియలో డోనర్స్ పేర్లను గోప్యంగా ఉంచడం కారణంగా, ఈ విషయం సున్నితత్వాన్ని పేర్కొంటూ, మొత్తం సమాచారాన్ని క్రోడీకరించడానికి బ్యాంకుకు మరింత సమయం అవసరమని అన్నారు. దాతల వివరాలను అజ్ఞాతంగా ఉంచడం కోసం ఏర్పాటు చేసినబ్రాంచీలలో సీల్డ్ కవర్లలో ఉంచినట్లు పేర్కొంది.
భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) DY చంద్రచూడ్ SBIని ప్రశ్నిస్తూ.. "వివరాలు సీల్డ్ కవర్‌లో ఉంచారు. వాటిని ముంబై బ్రాంచ్‌లో సబ్మిట్ చేశాం అని మీరు అంటున్నారు. మా ఆదేశాలు సమాచారంతో సరిపోలడం కోసం కాదు. మేము SBI దాతల స్పష్టమైన వివరాలను వెల్లడించాలని మాత్రమే కోరుకున్నాము. ఎందుకు? మీరు తీర్పును పాటించడం లేదా?" అంటూ తీవ్రంగా ప్రశ్నించారు. "అన్ని వివరాలు సీల్డ్ కవర్‌లో ఉన్నాయి కాబట్టి, మీరు సీల్డ్ కవర్‌ని తెరిచి వివరాలు ఇవ్వాలి" అని జస్టిస్ ఖన్నా కూడా ఎస్బీఐ కి గట్టిగా చెప్పారు.
విషయం ఇదీ..
ఫిబ్రవరి 15న సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేసింది. ఏప్రిల్ 12, 2019 నుండి జరిగిన అన్ని ఎలక్టోరల్ బాండ్ (Electoral Bonds Case)కొనుగోళ్ల వివరాలను మార్చి 6లోగా ECకి అందించాలని SBIని ఆదేశించింది. ఈ సమాచారాన్ని మార్చి 13లోగా EC వెబ్‌సైట్‌లో ప్రచురించాలని ఆదేశించింది.
అయితే, SBI, దాతల చుట్టూ ఉన్న అజ్ఞాత ప్రోటోకాల్‌ల కారణంగా ప్రక్రియ "సమయం తీసుకుంటుంది" అని పేర్కొంటూ, మరింత సమయం కోరుతూ మార్చి 4న కోర్టును ఆశ్రయించింది.
(ఇది ఇప్పుడే అందిన వార్త. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎప్పటికప్పుడు వివరాలను ఇక్కడ అప్ డేట్ చేస్తుంటాం. చూస్తూనే ఉండండి)