AP, TS election Date on May 13: వేసవి వేళ అవసరం లేకపోతే బయటకు రావొద్దని ప్రభుత్వాలు పదేపదే హెచ్చరిస్తుంటాయి. ఎందుకంటే వడదెబ్బ తగిలితే ప్రాణాలే పోతాయి. ఇక ఎండాకాలం వచ్చే ఆరోగ్య సమస్యలు అన్నీఇన్నీ కావు. ఎండలంటేనే దేశంలోని చాలా రాష్ట్రాల ప్రజలకు భయం. అందులో ఏపీ కూడా ఒకటి. ఇటు తెలంగాణ ప్రజలు కూడా వేసవిలో బయటకు రావాలంటేనే హడలిపోతారు. అటు సమ్మర్ టైమ్‌లో ప్రభుత్వాలు ఎన్నో జాగ్రత్తలు చెబుతాయి. అయితే ఈ సారి ఆ ప్రభుత్వమే మిమ్మల్ని ఎండలోకి రమ్మంటోంది. ఈ సారి ఎన్నికలు కాస్త లేట్‌గా మొదలువుతున్నాయి. సమ్మర్ పీక్స్ టైమ్‌లో ఎలక్షన్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏపీ, తెలంగాణకు వచ్చిన ఎన్నికల పోలింగ్ డేట్ చూస్తే ప్రజల్లో భయం కలుగుతోంది. మే 13న ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలతో పాటు తెలంగాణలో లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ డేట్ చూసిన ప్రజలకు వెంటనే భానుడే గుర్తొచ్చాడు.
ప్రజల్లో నిరాశ
ఎన్నికల పోలింగ్ ఉదయం 7 లేదా 8 గంటల నుంచి సాయంత్రం 5 లేదా 6 గంటల వరకు జరుగుతాయి. మే నెలలో భానుడు మార్నింగ్ నుంచే మంటపుట్టించడం మొదలుపెడతారు. సాయంత్రం 7గంటల వరకు అలానే మండిపోతుంటాడు. ఆ సమయంలో బయటకు వచ్చి ఎండకు ఎక్స్‌పోజ్ అయితే చాలా డేంజర్. ఓటు వేసే సమయం తక్కువే ఉంటుంది కానీ పోలింగ్ స్టేషన్ దగ్గర క్యూ ఉంటుంది. కాసేపు లైన్‌లో నిలబడాల్సిందే. అయితే ఓటు ప్రజల బాధ్యత, హక్కు కూడా. అందుకే ఎండ వేడి నేరుగా తగలకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తారు. కానీ ఎంత కవర్ చేసినా వేడి మాత్రం అలానే ఉంటుంది. మరికొన్ని చోట్ల అసలు షామియానా కూడా వెయ్యరు. ఎండలో నిలబడి ఓటు వెయ్యల్సిందే. ముఖ్యంగా మధ్యాహ్నం టైమ్‌లో ఇంటి నుంచి బయటకు రారు.. ఎండకు భయపడతారు. అలాంటి పరిస్థితులు ఉండే 'మే'లో పోలింగ్ డేట్ రావడంపై ప్రజల కాస్త నిరాశ చెందుతున్నారు.
తక్కువ అంచనా వెయ్యద్దు:
నిజానికి మన పోలింగ్ బూత్ ఇంటికి చాలా దగ్గరిలోనే ఉంటుంది. నడిచి వెళ్లే డిస్టెన్స్‌లోనే పోలింగ్ బూత్ ఉంటుంది. మరోవైపు వృద్ధులకు ఓట్ ఫ్రమ్ హోం ఆప్షన్ ఉంటుందని సీఈసీ రాజీవ్‌కుమార్ ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కొందరు అంటుండగా.. మేలో వచ్చే ఎండాలను తక్కువ అంచనా వెయ్యకూడదని మరికొందరు అంటున్నారు.
Also Read: మోగిన ఎన్నికల నగారా.. ఎలక్షన్ షెడ్యూల్ అవుట్.. తేదీలివే!