Elections 2024 Results🔴 LIVE Updates: ఏపీని క్లీన్ స్వీప్ చేసిన కూటమి.. ఏకంగా 163 సీట్లు..

ఎన్నికల కౌంటింగ్ తుది దశకు చేరుకుంది. ఏపీలో కూటమి క్లీన్ స్వీప్ చేసింది. 163 సీట్లు సాధించే దిశగా దూసుకెళ్తోంది. అధికార వైసీపీ కేవలం 12 సీట్లకే పరిమితం అయ్యే అవకాశం ఉంది. దేశ వ్యాప్తంగా ఎన్డీఏ 290, ఇండియా కూటమి 235 లోక్ సభ సీట్లను గెలుచుకునే అవకాశం ఉంది.

Elections 2024 Results🔴 LIVE Updates: ఏపీని క్లీన్ స్వీప్ చేసిన కూటమి.. ఏకంగా 163 సీట్లు..
New Update

Elections 2024 Results LIVE Updates:

  • Jun 04, 2024 22:46 IST
    ఏపీ ప్రజలకు చంద్రబాబునాయుడు ట్వీట్టర్ (ఎక్స్) వేదికగా ధన్యవాదాలు తెలిపారు. ఇది నేతలు, పార్టీ కార్యకర్తల విజయమన్నారు.

  • Jun 04, 2024 22:45 IST
    ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి నివాసంలో కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ మర్యాదపూర్వకంగా కలిశారు.

  • Jun 04, 2024 22:24 IST
    ప్రజల్లో ఎంతగా ఉన్నానో 21 సీట్లు గెలిచే వరకూ తెలియలేదు. పవన్ కల్యాణ్

  • Jun 04, 2024 22:23 IST
    ఏపీలో చీకటి రోజులు ముగిశాయి. పవన్ కల్యాణ్‌

  • Jun 04, 2024 22:23 IST
    మంగళగిరిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చి దిద్దుతాం. నారా లోకేష్‌

  • Jun 04, 2024 22:22 IST
    ఒక పవిత్రమైన బాధ్యతను ప్రజలు మాకు ఇచ్చారు. నారా లోకేష్

  • Jun 04, 2024 22:22 IST
    బుధవారం ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్

  • Jun 04, 2024 22:22 IST
    మా అబ్బాయిని గెలిపించినందుకు సంతోషంగా ఉంది. ప్రజలకు కృతజ్ఞతలు. పవన్ కల్యాణ్ తల్లి

  • Jun 04, 2024 22:21 IST
    దేశంలో ఎన్నికల నిర్వహణ ప్రతి ఒక్కరు గర్వించేలా ఉంది. మోడీ

  • Jun 04, 2024 22:20 IST
    బుధవారం ఢిల్లీలో ఎన్డీఏ సమావేశం

  • Jun 04, 2024 21:55 IST
    కేరళలో తొలిసారి ఎంపీ సీటు గెలిచిన బీజేపీ

  • Jun 04, 2024 21:51 IST
    డీఎంకే ఆఫీసుకు వెళ్లి తమిళనాడు సీఎం స్టాలిన్ కు శుభాకాంక్షలు చెప్పిన నటుడు కమల్ హాసన్

  • Jun 04, 2024 21:51 IST
    తమిళనాడులో ఒక్క సీటు గెలవలేకపోయిన బీజేపీ

  • Jun 04, 2024 21:31 IST
    చంద్రబాబు నాయుడు జనసేన కార్యాలయానికి వెళ్లడం ఇదే తొలిసారి.

  • Jun 04, 2024 21:30 IST
    చంద్రబాబుకు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు అకీరా నందన్.

  • Jun 04, 2024 21:30 IST
    తన తయుడు అకీరా నందన్ ను చంద్రబాబుకు పవన్ పరిచయం చేశారు.

  • Jun 04, 2024 21:30 IST
    భార్యతో కలిసి చంద్రబాబుకు పవన్ కల్యాణ్ ఆత్మీయ స్వాగతం పలికారు.

  • Jun 04, 2024 21:29 IST
    మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్ కల్యాణ్‌ను చంద్రబాబు నాయుడు కలిశారు.

  • Jun 04, 2024 21:26 IST
    టిడిపి అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావు ఆలియాస్ కోండబాబు 56,572 ఓట్లు మెజార్టీతో వైసీపీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పై విజయం

  • Jun 04, 2024 21:16 IST
    జగన్ రాజీనామా ఆమోదించిన ఏపీ గవర్నర్

  • Jun 04, 2024 21:15 IST
    పరస్పరం అభినందనలు తెలుపుకున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్

  • Jun 04, 2024 21:08 IST
    అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ప్రతి రాష్ట్రంలోనూ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు. మోడీ

  • Jun 04, 2024 21:07 IST
    మీ ప్రేమకు కృతజ్ఞతలు. మోడీ

  • Jun 04, 2024 21:01 IST
    కేరళలోనూ ఈసారి ఒక సీటు గెలుచుకున్నాం. మోడీ

  • Jun 04, 2024 21:01 IST
    మూడోసారి ఎన్డీఏ అధికారం చేపట్టబోతుంది. మోడీ

  • Jun 04, 2024 21:00 IST
    ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మోడీ అభినందనలు తెలిపారు.

  • Jun 04, 2024 19:39 IST
    గుజరాత్‌ : గాంధీనగర్‌లో 7.44 లక్షల మెజార్టీతో అమిత్‌ షా గెలుపు.

  • Jun 04, 2024 19:36 IST
    మూడో సారి గెలుపు తర్వాత ప్రధాని మోదీ ట్వీట్.. ఎన్డీఐ కూటమి పై దేశ ప్రజలు చూపిన విశ్వాసం నిలబెట్టుకుందాము.

  • Jun 04, 2024 19:24 IST
    రాజీనామ లేఖను గవర్నర్ కు పంపిన జగన్

  • Jun 04, 2024 19:19 IST
    ఇది కక్ష సాధింపు సమయం కాదు, ప్రజల కోసం పనిచేసే సమయం: పవన్

  • Jun 04, 2024 19:19 IST
    ముఖ్యమంత్రి పదవికి వైఎస్ జగన్ రాజీనామా

  • Jun 04, 2024 19:14 IST
    జగన్ వ్యక్తిగతంగా నాకు శత్రువు కాదు: పవన్

  • Jun 04, 2024 19:12 IST
    ఈ గెలుపు జనసైనికులదే మాత్రమే కాదు.. 5 కోట్ల మంది ప్రజలది: పవన్

  • Jun 04, 2024 19:11 IST
    ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. పోటీ చేసిన అన్ని స్థానాల్లో 100 శాతం గెలిచామన్నారు పవన్

  • Jun 04, 2024 18:48 IST
    ఏలూరు, విజయనగరంలో టీడీపీ అభ్యర్థుల విజయకేతనం

  • Jun 04, 2024 18:42 IST
    ఏం జరిగిందో తెలియదు కానీ.. ఏమి చేసినా ఎంత చేసినా 40 శాతం ఓటు బ్యాంకును తగ్గించలేకపోయారన్నారు. గుండె ధైర్యంతో లేస్తాం అన్నారు.

  • Jun 04, 2024 18:41 IST
    చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు వాళ్ల గొప్ప విజయానికి అభినందలు అని అన్నారు. నా ప్రతీ కష్టంలో తోడుగా, అండగా ఉన్న ప్రతీ నాయకుడు, కార్యకర్త, వాలంటీర్ కు, అక్కాచెళ్లెమ్మలు, అన్నాదమ్ములకు ధన్యవాదాలు తెలిపారు జగన్.

  • Jun 04, 2024 18:37 IST
    91,500 భారీ మెజారిటీతో నారా లోకేష్ గెలుపు

  • Jun 04, 2024 18:33 IST
    ఇన్ని కోట్ల మందికి మంచి జరిగిన తర్వాత ఆ అభిమానం, ఆ ఆప్యాయత ఏమైందో తెలియదన్నారు. ఎవరో మోసం చేశారు, అన్యాయం చేశారని అనొచ్చు కానీ ఆధారాలు లేవన్నారు. పేదల పక్షాన ఉంటామంటూ భావోద్వేగానికి గురయ్యారు జగన్.

  • Jun 04, 2024 18:31 IST
    మహిళాసాధికారత, సామాజిక న్యాయం అంటే ఇది అని ప్రపంచానికి చూపించగలిగామన్నారు జగన్.

  • Jun 04, 2024 18:29 IST
    కోట్లమందికి మంచి చేశాము. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్ మాదిరిగా భావించి 99 శాతం హమీలను అమలు చేశామన్నారు జగన్.

  • Jun 04, 2024 18:21 IST
    పిల్లలకు నాణ్యమైన విద్య అందించడం కోసం అనేక విప్లవాత్మక మార్పులు తెచ్చాము. ఆ పిల్లలు, తల్లుల అభిమానం ఏమైందో తెలియదని అన్నారు వైఎస్ జగన్

  • Jun 04, 2024 18:14 IST
    ప్రెస్ మీట్ లో ఎన్నికల ఆశ్చర్యంగా ఉన్నాయన్నారు జగన్. ఇలాంటి ఫలితాలను ఊహించలేదన్నారు. అనేక పథకాల ద్వారా పేదలకు చేయూతనిచ్చామన్నారు. వారి ఓట్లు ఏమయ్యాయో అర్థం కావడం లేదన్నారు.

  • Jun 04, 2024 18:07 IST
    గుంటూరు, తుర్పు గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం, నెల్లూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం, కృష్ణా జిల్లాలో.. ఖాతా తెరవని వైసీపీ

  • Jun 04, 2024 18:03 IST
    అనకాపల్లిలో జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ విజయం

  • Jun 04, 2024 17:59 IST
    భీమిలీ, చీరాల, దర్శి నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థుల విజయకేతనం

  • Jun 04, 2024 17:54 IST
    పోటీ చేసిన 21 స్థానాల్లో గెలవబోతున్న జనసేన పార్టీ అభ్యర్థులు

  • Jun 04, 2024 17:45 IST
    అమేథీ, కోయంబత్తూరులో బీజేపీ అభ్యర్థులు స్మ్రితీఇరానీ, అన్నామలై ఓటమి

  • Jun 04, 2024 17:42 IST
    వాయనాడు, రాయబరేలీ స్థానాల్లో రాహుల్ గాంధీ ఘన విజయం

  • Jun 04, 2024 17:35 IST
    ఖమ్మం, మహబూబాబాద్, జహీరాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థుల ఘన విజయం

#election-results #general-elections-2024 #ap-assembly-elections-2024 #2024-elections
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి