New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/india-andhra-telangana-counting-live-updates.jpg)
Elections 2024 Results LIVE Updates:
-
Jun 04, 2024 22:46 IST
ఏపీ ప్రజలకు చంద్రబాబునాయుడు ట్వీట్టర్ (ఎక్స్) వేదికగా ధన్యవాదాలు తెలిపారు. ఇది నేతలు, పార్టీ కార్యకర్తల విజయమన్నారు.
-
Jun 04, 2024 22:45 IST
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి నివాసంలో కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ మర్యాదపూర్వకంగా కలిశారు.
-
Jun 04, 2024 22:24 IST
ప్రజల్లో ఎంతగా ఉన్నానో 21 సీట్లు గెలిచే వరకూ తెలియలేదు. పవన్ కల్యాణ్
-
Jun 04, 2024 22:23 IST
ఏపీలో చీకటి రోజులు ముగిశాయి. పవన్ కల్యాణ్
-
Jun 04, 2024 22:23 IST
మంగళగిరిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చి దిద్దుతాం. నారా లోకేష్
-
Jun 04, 2024 22:22 IST
ఒక పవిత్రమైన బాధ్యతను ప్రజలు మాకు ఇచ్చారు. నారా లోకేష్
-
Jun 04, 2024 22:22 IST
బుధవారం ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్
-
Jun 04, 2024 22:22 IST
మా అబ్బాయిని గెలిపించినందుకు సంతోషంగా ఉంది. ప్రజలకు కృతజ్ఞతలు. పవన్ కల్యాణ్ తల్లి
-
Jun 04, 2024 22:21 IST
దేశంలో ఎన్నికల నిర్వహణ ప్రతి ఒక్కరు గర్వించేలా ఉంది. మోడీ
-
Jun 04, 2024 22:20 IST
బుధవారం ఢిల్లీలో ఎన్డీఏ సమావేశం
-
Jun 04, 2024 21:55 IST
కేరళలో తొలిసారి ఎంపీ సీటు గెలిచిన బీజేపీ
-
Jun 04, 2024 21:51 IST
డీఎంకే ఆఫీసుకు వెళ్లి తమిళనాడు సీఎం స్టాలిన్ కు శుభాకాంక్షలు చెప్పిన నటుడు కమల్ హాసన్
-
Jun 04, 2024 21:51 IST
తమిళనాడులో ఒక్క సీటు గెలవలేకపోయిన బీజేపీ
-
Jun 04, 2024 21:31 IST
చంద్రబాబు నాయుడు జనసేన కార్యాలయానికి వెళ్లడం ఇదే తొలిసారి.
-
Jun 04, 2024 21:30 IST
చంద్రబాబుకు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు అకీరా నందన్.
-
Jun 04, 2024 21:30 IST
తన తయుడు అకీరా నందన్ ను చంద్రబాబుకు పవన్ పరిచయం చేశారు.
-
Jun 04, 2024 21:30 IST
భార్యతో కలిసి చంద్రబాబుకు పవన్ కల్యాణ్ ఆత్మీయ స్వాగతం పలికారు.
-
Jun 04, 2024 21:29 IST
మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్ కల్యాణ్‌ను చంద్రబాబు నాయుడు కలిశారు.
-
Jun 04, 2024 21:26 IST
టిడిపి అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావు ఆలియాస్ కోండబాబు 56,572 ఓట్లు మెజార్టీతో వైసీపీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పై విజయం
-
Jun 04, 2024 21:16 IST
జగన్ రాజీనామా ఆమోదించిన ఏపీ గవర్నర్
-
Jun 04, 2024 21:15 IST
పరస్పరం అభినందనలు తెలుపుకున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్
-
Jun 04, 2024 21:08 IST
అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ప్రతి రాష్ట్రంలోనూ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు. మోడీ
-
Jun 04, 2024 21:07 IST
మీ ప్రేమకు కృతజ్ఞతలు. మోడీ
-
Jun 04, 2024 21:01 IST
కేరళలోనూ ఈసారి ఒక సీటు గెలుచుకున్నాం. మోడీ
-
Jun 04, 2024 21:01 IST
మూడోసారి ఎన్డీఏ అధికారం చేపట్టబోతుంది. మోడీ
-
Jun 04, 2024 21:00 IST
ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మోడీ అభినందనలు తెలిపారు.
-
Jun 04, 2024 19:39 IST
గుజరాత్ : గాంధీనగర్‌లో 7.44 లక్షల మెజార్టీతో అమిత్ షా గెలుపు.
-
Jun 04, 2024 19:36 IST
మూడో సారి గెలుపు తర్వాత ప్రధాని మోదీ ట్వీట్.. ఎన్డీఐ కూటమి పై దేశ ప్రజలు చూపిన విశ్వాసం నిలబెట్టుకుందాము.
-
Jun 04, 2024 19:24 IST
రాజీనామ లేఖను గవర్నర్ కు పంపిన జగన్
-
Jun 04, 2024 19:19 IST
ఇది కక్ష సాధింపు సమయం కాదు, ప్రజల కోసం పనిచేసే సమయం: పవన్
-
Jun 04, 2024 19:19 IST
ముఖ్యమంత్రి పదవికి వైఎస్ జగన్ రాజీనామా
-
Jun 04, 2024 19:14 IST
జగన్ వ్యక్తిగతంగా నాకు శత్రువు కాదు: పవన్
-
Jun 04, 2024 19:12 IST
ఈ గెలుపు జనసైనికులదే మాత్రమే కాదు.. 5 కోట్ల మంది ప్రజలది: పవన్
-
Jun 04, 2024 19:11 IST
ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. పోటీ చేసిన అన్ని స్థానాల్లో 100 శాతం గెలిచామన్నారు పవన్
-
Jun 04, 2024 18:48 IST
ఏలూరు, విజయనగరంలో టీడీపీ అభ్యర్థుల విజయకేతనం
-
Jun 04, 2024 18:42 IST
ఏం జరిగిందో తెలియదు కానీ.. ఏమి చేసినా ఎంత చేసినా 40 శాతం ఓటు బ్యాంకును తగ్గించలేకపోయారన్నారు. గుండె ధైర్యంతో లేస్తాం అన్నారు.
-
Jun 04, 2024 18:41 IST
చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు వాళ్ల గొప్ప విజయానికి అభినందలు అని అన్నారు. నా ప్రతీ కష్టంలో తోడుగా, అండగా ఉన్న ప్రతీ నాయకుడు, కార్యకర్త, వాలంటీర్ కు, అక్కాచెళ్లెమ్మలు, అన్నాదమ్ములకు ధన్యవాదాలు తెలిపారు జగన్.
-
Jun 04, 2024 18:37 IST
91,500 భారీ మెజారిటీతో నారా లోకేష్ గెలుపు
-
Jun 04, 2024 18:33 IST
ఇన్ని కోట్ల మందికి మంచి జరిగిన తర్వాత ఆ అభిమానం, ఆ ఆప్యాయత ఏమైందో తెలియదన్నారు. ఎవరో మోసం చేశారు, అన్యాయం చేశారని అనొచ్చు కానీ ఆధారాలు లేవన్నారు. పేదల పక్షాన ఉంటామంటూ భావోద్వేగానికి గురయ్యారు జగన్.
-
Jun 04, 2024 18:31 IST
మహిళాసాధికారత, సామాజిక న్యాయం అంటే ఇది అని ప్రపంచానికి చూపించగలిగామన్నారు జగన్.
-
Jun 04, 2024 18:29 IST
కోట్లమందికి మంచి చేశాము. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్ మాదిరిగా భావించి 99 శాతం హమీలను అమలు చేశామన్నారు జగన్.
-
Jun 04, 2024 18:21 IST
పిల్లలకు నాణ్యమైన విద్య అందించడం కోసం అనేక విప్లవాత్మక మార్పులు తెచ్చాము. ఆ పిల్లలు, తల్లుల అభిమానం ఏమైందో తెలియదని అన్నారు వైఎస్ జగన్
-
Jun 04, 2024 18:14 IST
ప్రెస్ మీట్ లో ఎన్నికల ఆశ్చర్యంగా ఉన్నాయన్నారు జగన్. ఇలాంటి ఫలితాలను ఊహించలేదన్నారు. అనేక పథకాల ద్వారా పేదలకు చేయూతనిచ్చామన్నారు. వారి ఓట్లు ఏమయ్యాయో అర్థం కావడం లేదన్నారు.
-
Jun 04, 2024 18:07 IST
గుంటూరు, తుర్పు గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం, నెల్లూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం, కృష్ణా జిల్లాలో.. ఖాతా తెరవని వైసీపీ
-
Jun 04, 2024 18:03 IST
అనకాపల్లిలో జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ విజయం
-
Jun 04, 2024 17:59 IST
భీమిలీ, చీరాల, దర్శి నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థుల విజయకేతనం
-
Jun 04, 2024 17:54 IST
పోటీ చేసిన 21 స్థానాల్లో గెలవబోతున్న జనసేన పార్టీ అభ్యర్థులు
-
Jun 04, 2024 17:45 IST
అమేథీ, కోయంబత్తూరులో బీజేపీ అభ్యర్థులు స్మ్రితీఇరానీ, అన్నామలై ఓటమి
-
Jun 04, 2024 17:42 IST
వాయనాడు, రాయబరేలీ స్థానాల్లో రాహుల్ గాంధీ ఘన విజయం
-
Jun 04, 2024 17:35 IST
ఖమ్మం, మహబూబాబాద్, జహీరాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థుల ఘన విజయం
తాజా కథనాలు