Elections: తెలుగు రాష్ట్రాల్లో ఈ నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్‌!

తెలుగు రాష్ట్రాల్లోని పలు నియోజకవర్గాల్లో ప్రశాంతంగా పోలింగ్‌ ముగిసింది. తెలంగాణ లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్‌ సమయం ముగిసింది. తెలంగాణలోని 5 లోక్‌ సభ నియోజకవర్గాల పరిధిలోని 13 అసెంబ్లీ స్థానాలకు సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసింది.

Andhra Pradesh: ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల..
New Update

Elections: తెలుగు రాష్ట్రాల్లోని పలు నియోజకవర్గాల్లో ప్రశాంతంగా పోలింగ్‌ ముగిసింది. తెలంగాణ లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్‌ సమయం ముగిసింది. తెలంగాణలోని 5 లోక్‌ సభ నియోజకవర్గాల పరిధిలోని 13 అసెంబ్లీ స్థానాలకు సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసింది.

తెలంగాణ లోని నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాలైన మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, భద్రాచలం, పినపాక, ఇల్లందు, అశ్వరావుపేట, కొత్తగూడెం, ఆసిఫాబాద్‌, సిర్పూర్‌, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్(Election polling) 4 గంటలకు ముగిసింది.

ఇదిలా ఉంటే ఏపీలోని అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో కూడా పోలింగ్‌ 4 గంటలకు ముగిసింది. సాయంత్రం 4గంటల లోపు క్యూలైన్లలో వేచి ఉన్నవారికి ఓటేసేందుకు అవకాశం ఇచ్చారు. మిగతా నియోజకవర్గాల్లో ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. సమస్యాత్మక నియోజకవర్గాలైన పాలకొండ, కురుపాం, సాలూరులో 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

Also read: పీవోను చితకబాదిన గ్రామస్తులు..నిలిచిన పోలింగ్‌!

#telangana #ap #elections #politics #polling #elections-2024
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe