తెలంగాణలో ఎన్నికలు వాయిదా!?

సింగరేణిలో జరగబోయే గుర్తింపు సంఘం ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉంది. మార్చి నెలాఖరు వరకు ఈ ఎన్నికలు జరిపించాలని కోరుతూ రాష్ట్ర ఇంధన వనరుల శాఖ కార్యదర్శి పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్ అంగీకరించిన హైకోర్టు సోమవారం ఇరువురి వాదనలు విని తుది తీర్పు వెల్లడించనుంది.

New Update
తెలంగాణలో ఎన్నికలు వాయిదా!?

సింగరేణిలో జరగబోయే గుర్తింపు సంఘం ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి డిసెంబర్ 27న ఈ ఎలక్షన్స్ జరగాల్సి ఉండగా ఇప్పటికే కార్మిక సంఘాలన్నీ తమ ప్రచారం మొదలుపెట్టాయి. అయితే ఈ ఎన్నికలు వాయిదా వేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుక్రవారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు వేయడం చర్చనీయాంశమైంది.

ఈ మేరకు మార్చి నెలాఖరు వరకు ఈ ఎన్నికలు జరిపించాలని కోరుతూ రాష్ట్ర ఇంధన వనరుల శాఖ కార్యదర్శి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఇటీవలే రాష్ట్రంలో ఏర్పాటైన కొత్త గవర్నమెంట్ అధికార, పోలీసు యంత్రాంగం తదితర బాధ్యతల్లో బీజీగా ఉందని, కావున ఈ ఎన్నికలపై దృష్టి పెట్టడం కష్టమవుతుందని ఇందులో ఆయన పేర్కొన్నారు. అలాగే మరో నెల రోజుల్లోనే గ్రామపంచాయతీ, మండల పరిషత్‌, పార్లమెంట్‌ ఎలక్షన్స్ జరగనుండటంతో ఈ ఎలక్షన్స్ పోస్ట్ పోన్ చేయాలని పిటిషన్ లో న్యాయస్థానాన్ని కోరారు.

ఈ క్రమంలోనే ఎలక్షన్స్ పోస్ట్ పోన్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు గమనించిన సింగరేణి నాయకులు ఇంధనశాఖ కంటే ముందుగానే హైకోర్టును ఆశ్రయించారు. ఏఐటీయూసీ యూనియన్ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య ఎన్నికలు వాయిదా వేయొద్దంటూ కేవియెట్‌ పిటిషన్‌ వేశారు. దీంతో ఈ ఎలక్షన్స్ పై స్టే ఇవ్వకుండానే ఇంధన శాఖ పిటిషన్‌ను హైకోర్టు విచారణను అంగీకరించగా సోమవారం ఇరువురి వాదనలు విని ఫైనల్ తీర్పు వెల్లడించనుంది.

ఇది కూడా చదవండి : కరీంనగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

కార్మిక సంఘాల ఆగ్రహం:
డిసెంబర్ లోనే ఎన్నికలు జరిపేందుకు పక్కా ప్రణాళికతో ఉన్న సింగరేణి నాయకులు నామినేషన్లకోసం సర్వం సిద్ధం చేసుకున్నారు. సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో 84 పోలింగ్ కేంద్రాలకు ఏర్పాట్లు కూడా చేశారు. కానీ ఉన్నట్టుండి రాష్ట్ర ప్రభుత్వం వాయిదా ఇష్యూను ముందుకు తీసుకురావడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐఎన్ టీయూసీ ఓటమి పాలవుతుందనే ఎలక్షన్స్ వాయిదా వేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఏఐటీయూసీ సింగరేణి విభాగం కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య ఆరోపించారు.ఇతర సంఘాల నేతలను తమ యూనియన్‌లో చేర్చుకుని ఎన్నికల్లో ఎలాగైన గెలవాలని కాంగ్రెస్‌ ప్లాన్ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక అసెంబ్లీ ఎన్నికలలాగే సింగరేణి గుర్తింపు యూనియన్‌ ఫలితాలు రావాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఐఎన్‌టీయూసీ ప్రతినిధులకు సూచించారు. నిజానికి సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నాలుగేళ్లకొకసారి జరగాలి. కానీ 2017లో చివరి ఎన్నికలు జరగగా 2021లో జరగాల్సినవి వాయిదా పడ్డాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు