తెలంగాణలో ఎన్నికల జోరు మంచి హుషారుగా సాగుతుంది. ఇప్పటికే ప్రధాన పార్టీల నేతలందరూ కూడా తమ ప్రచార పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయినప్పటి నుంచి కూడా రాష్ట్రంలో ప్రతి వీధిలో ఎన్నికల హడావిడి కనిపిస్తుంది. ఎన్నికలు అంటే కేవలం రాజకీయ నాయకులతోనే అయిపోదుగా..!
ఎన్నికల అధికారులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేస్తారు. వీరిలో ఉపాధ్యాయులది కీలక పాత్ర అనే చెప్పవచ్చు. ఈ నెల 30 న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్రంలోని ఉపాధ్యాయుల్లో సుమారు 80 శాతం మంది విధుల్లో పాల్గొంటారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పోలింగ్ తేది నవంబర్ 30, దాని ముందురోజు నవంబర్ 29 న రెండు రోజులు కూడా ప్రభుత్వ పాఠశాలకు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎన్నికల సంఘం సూచన మేరకు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నట్లు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల్లో విధుల్లో పాల్గొనే టీచర్స్ నవంబర్ 29 నే ఈవీఎం యంత్రాలు తీసుకునేందుకు రెడీగా ఉన్నామంటూ అధికారులకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. పోలింగ్‌కు ముందు రోజే మధ్యాహ్నానికే పోలీంగ్ కేంద్రాలు అయినటువంటి పాఠశాలలకు ఉపాధ్యాయులు చేరుకోవాల్సి ఉంటుంది.
ఎన్నికలు పూర్తయ్యి ఈవీఎంలను ఎన్నికల అధికారులకు సమర్పించి మొత్తం పూర్తి చేసే సరికి ఎన్నికల రోజు అర్థరాత్రి దాటుతుంది. ఈ ఏడాది రాష్ట్రంలోని ఉపాధ్యాయుల్లో 80 శాతం మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నట్లు సమాచారం. ఈ మేరకు రెండు రోజులు ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ఇవ్వాలని విద్యాశాఖ వర్గాలు అనుకుంటున్నాయి.
ఇదిలా ఉంటే ఎన్నికల తరువాత రోజు కూడా ఉపాధ్యాయులకు అంటే డిసెంబర్ 1న కూడా సెలవు ఇవ్వాలనే డిమాండ్ మొదటి నుంచి కూడా వినిపిస్తోంది.దీని గురించి ఎన్నికల సంఘాన్ని రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు రాజభాను చంద్రప్రకాశ్, తెలంగాన మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ (టీఎంఎస్‌టీఏ) రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకమల్లు కోరారు.
Also read: సహార గ్రూప్ వ్యవస్ధాపకుడు సుబ్రతారాయ్ కన్నుమూత..!!