Lok Sabha Elections: ఏప్రిల్ 13న లోక్ సభ ఎన్నికలు?

లోక్ సభ ఎన్నికల నిర్వహణపై కసరత్తు చేస్తోంది ఈసీ. ఏప్రిల్ 13న తొలి దశ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. మార్చి 13 తర్వాత ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మార్చి 8, 9 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ అధికారులతో ఈసీ భేటీ కానుంది.

Lok Sabha Elections: ఏప్రిల్ 13న లోక్ సభ ఎన్నికలు?
New Update

Lok Sabha Elections 2024 Schedule: లోక్ సభ ఎన్నికల ఎప్పుడు జరుగుతాయనే దానిపై జరుగుతున్న చర్చకు మరికొన్ని రోజుల్లో తెర పడనుంది. లోక్ సభ ఎన్నికల నిర్వహణను కసరత్తు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission). ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్‌ రెడీ చేసింది. ఏ క్షణంలోనైనా ఎన్నికల నోటిఫికేషన్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసే అవకాశం ఉంది.

సార్వత్రిక ఎన్నికల తేదీలపై దాదాపుగా కసరత్తు ముగిసినట్లు చర్చ నడుస్తోంది. ఏప్రిల్ 13న తొలి దశ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొత్తం 7 విడతల్లో ఎన్నికలు ఉండనున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభతో పాటు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) నిర్వహించనుంది ఎన్నికల సంఘం. ఈ క్రమంలో ఎన్నికల సంఘం కొన్నిరోజులుగా రాష్ట్రాల్లో వరుస పర్యటనలు చేస్తోంది.

ఇందులో భాగంగా మార్చి 13 తర్వాత ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం, ఏపీ (AP) అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. జమ్మూకాశ్మీర్‌లోనూ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఈసీ ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మార్చి 8, 9 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ అధికారులతో ఈసీ భేటీ కానుంది. మార్చి 12, 13 జమ్మూకాశ్మీర్‌లో ఎన్నికల సంఘం అధికారులు పర్యటించనున్నారు.

మొదలైన రాజకీయ వేడి..

లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే దేశంలో రాజకీయ వేడి మొదలైంది. ఇప్పటికే అభ్యర్థులపై కసరత్తు చేస్తున్నాయి అన్ని ప్రధాన పార్టీలు. జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ (Article) 370 రద్దు చేసిన బీజేపీ పార్టీకి (BJP) ప్రజలు 370 ఎంపీ సీట్లు కట్టబెడుతారని.. ఎన్డీయే కూటమి తో కలిపి బీజేపీ మొత్తం 400 లకు పైగా ఎంపీ సీట్లు కైవసం చేసుకుంటుందని ప్రచారం చేసుకుంటున్నారు ఆ పార్టీ నేతలు. మరో వైపు ఇండియా కూటమి కూడా తమకు 400 సీట్లు వచ్చి కేంద్రంలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాలంటే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాలి.

Also Read: అవినీతి ఆఫీసర్ జగజ్యోతి అరెస్ట్.. 65 లక్షల నగదు, 4కిలోల బంగారం స్వాధీనం!

#lok-sabha-elections-2024 #lok-sabha-elections #central-election-commission #mp-elections
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe