Lok Sabha Elections: తెలంగాణలో ఆ స్థానాలపై ఈసీ స్పెషల్ ఫోకస్‌.. ఎందుకంటే

దేశవ్యాప్తంగా 50 నియోజకవర్గాల్లో తక్కువ ఓటింగ్ నమోదవుతున్నట్లు గుర్తించిన ఈసీ ఆయా స్థానాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ జాబితాలో తెలంగాణకు చెందిన మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల స్థానాలు ఉన్నాయి.

New Update
Elections: తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ జాతర..ఇవాళ్టి నుంచే నమోదు

లోక్‌సభ ఎన్నికలు దగ్గరికొస్తున్నాయి. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీల నేతలు ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో ఓటింగ్‌కు సంబంధించి కేంద్ర ఎన్నికల ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. గత ఎన్నికలో కొన్ని నియోజకవర్గాల్లో తక్కువ శాతం పోలింగ్ నమోదయ్యాయి. దీంతో ఆయా నియోజకవర్గాల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఈసీ చర్యలు చేపట్టింది. దేశవ్యా్ప్తంగా చూసుకుంటే.. 50 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో తక్కువగా ఓటింగ్ శాతం నమోదవుతున్నట్లు గుర్తించింది.

Also Read: కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటన

ఈ క్రమంలోనే.. తెలంగాణలో నాలుగు జిల్లాల్లో తక్కువగా ఓటింగ్ శాతం నమోదవుతున్నట్లు గుర్తించింది. దీంతో ఆ జిల్లాల ఎన్నికల అధికారులతో సీఈసీ రాజీవ్‌కుమార్‌ శుక్రవారం సమావేశమయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో.. మల్కాజ్‌గిరి (49%), సికింద్రాబాద్ (46%), హైదరాబాద్ (44%), చేవెళ్ల (53%) స్థానాల్లో తక్కువగా పోలింగ్ నమోదైంది. అందుకే ఈ నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది ఈసీ.

మహానగరంలో.. తక్కువగా ఓటింగ్ నమోదు కావడంపై ఎన్నికల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఇందుకోసం ఓటర్లకు రవాణా సౌకర్యం కల్పించాలని ఈసీ.. అధికారులకు ఆదేశించింది. అలాగే ఓటు హక్కు వినియోగంపై.. రెసిడెంట్ వెల్ఫేర్‌ అసోసియేషన్‌లతో కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపింది. ఇంకా పలు కార్యక్రమాలు చేపట్టి ఓటర్లలో చైతన్యం పెంచాలని సూచనలు చేసింది.

Also Read: హైదరాబాద్, చెన్నై మ్యాచ్ కు తెలంగాణ సీఎం

Advertisment
తాజా కథనాలు