/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-1-2-jpg.webp)
Election Commission : పోలింగ్ ఏజెంట్ల(Polling Agents) నియామక ప్రక్రియ పై ఈసీ(EC) ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ ఏజెంట్ల నియామకం లిస్టును రిటర్నింగ్ అధికారికి ఇవ్వాల్సిన అవసరం లేదని ఈసీ తెలిపింది. పోలింగ్ రోజున ప్రిసైడింగ్ అధికారికి పోలింగ్ ఏజెంట్ తమ వివరాలు సమర్పిస్తే చాలని ఈసీ వివరించింది. అయితే పోలింగ్ ఏజెంట్లను ఆయా పార్టీల అభ్యర్థులు ధ్రువీకరించాల్సి ఉంటుందని పేర్కొంది.
ప్రొసైడింగ్ ఆఫీసర్ సమక్షంలో పోలింగ్ ఏజెంట్ల నుంచి డిక్లరేషన్ తీసుకోవాలని ఈసీ క్లారిటీ ఇచ్చింది.పోలింగ్ ఏజెంట్ల విషయంలో అధికార దుర్వినియోగం జరగకుండా ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. పోలీసు కేసులు ఉన్నా ఏజెంట్‌లుగా పనిచేయవచ్చని పేర్కొంది. ఏజెంట్ల నియామకం విషయంలో పోలీసులు అభ్యంతరాలు తెలిపే అధికారం లేదని ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
Also read: జగనన్నపై షర్మిల ఆఖరి అస్త్రం.. రేపు కడపకు రాహుల్ గాంధీ!