Sharad Pawar: శరద్‌పవార్ కు ఈసీ నోటీసులు

శరద్‌పవార్ కు ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. ఆయనకు నోటీసులు ఇచ్చింది. అజిత్ పవార్ వర్గాన్ని అసలైన ఎన్సీపీగా ఎన్నికల కమిషన్ గుర్తించింది. ఈ నేపథ్యంలో ఎన్సీపీ గడియారం గుర్తును అజిత్ వర్గానికి కేటాయించింది.

New Update
Sharad Pawar: ఇక నుంచి శరద్ పవార్ పార్టీ పేరు ఇదే..!!

Sharad Pawar: మరికొన్ని నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న వేళ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఎన్సీపీ నుంచి విడిపోయిన అజిత్ పవార్ వర్గాన్ని అసలైన ఎన్సీపీగా ఎన్నికల కమిషన్ గుర్తించింది. శరద్‌పవార్ కు నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్సీపీ గడియారం గుర్తును అజిత్ వర్గానికి కేటాయించింది.

ఇది కాంగ్రెస్ కు షాకే..

లోక్ సభ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని గద్దె దించాలని విపక్షా పార్టీలన్నీ కలిసి ఇండియా కూటమి ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఎన్నికల కమిషన్ మహారాష్ట్ర లోని నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్‌పవార్ కు ఊహించని షాక్ ఇచింది ఇచ్చింది. పార్టీ, చిహ్నం అజిత్ పవార్ కు కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడంతో కాంగ్రెస్ కు లోక్ సభ ఎన్నికలల్లో మహారాష్ట్రలో పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది. దీనికి ప్రధాన కారణం శరద్ పవార్ ఇండియా కూటమిలో ఉండడమే. పార్టీ పేరు, చిహ్నం అజిత్ పవార్ కు కేటాయించడంతో ఆ పార్టీ పూర్తి హక్కులు శరద్ పవార్ చేతి నుంచి చేజారాయి.

బీజేపీకి ప్లస్...

ఎన్సీపీ విషయంలో ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం బీజేపీకి ప్లస్ పాయింట్ అయింది. లోక్ సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో అడ్డంకి లేకుండా చేసింది. దీనికి ప్రధాన కారణం కొద్ది నెలల క్రితం వరకు అజిత్ పవార్ ఇండియా కూటమిలోనే ఉండేవాడు. కానీ ఇటీవల రాజకీయ పరిణామాలు మారడంతో తన వర్గం ఎమ్మెల్యేను తీసుకొని అజిత్ పవార్ బీజేపీ, శివసేనల కలిసి మహారాష్ట్ర ప్రభుత్వంలో భాగం అయ్యారు. దీంతో మహారాష్ట్రలో బీజేపీకి లోక్ సభ ఎన్నికల్లో ఓటమిని అనేదే లేకుండా అయింది. ఇది శరద్ పవార్ తో పాటు ఇండియా కూటమికి పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి.

DO WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు