CM Revanth Reddy: లోక్ సభ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డికి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున శ్రీరామ నవమి - భద్రాద్రి సీతారామచంద్రస్వామి వారికి సీఎం రేవంత్ రెడ్డి పట్టువస్త్రాల సమర్పణకు, కళ్యాణ మహోత్సవ ప్రత్యక్ష ప్రసారానికి ఎలక్షన్ కమిషన్ నిరాకరించింది. ఒకవేళ తాము విధించిన ఆంక్షలు ఎవరైనా ఉల్లఘించి.. లైవ్ ఇస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. మరోవైపు అయోధ్య రామమందిరం లో ప్రత్యేక్ష ప్రసారం ఇవ్వడానికి ఎన్నికల కమిషన్ ఎలాంటి ఆంక్షలు పెట్టకపోవడంపై కాంగ్రెస్ నేతలు ఈసీ పై విమర్శలు చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా పనిచేయాల్సిన ఎన్నికల సంఘం బీజేపీ పార్టీకి కాస్తుందని సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. మోడీ కనుసన్నల్లో ఎన్నికల కమిషన్ పనిచేస్తోందని ఫైర్ అవుతున్నారు.
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి ఈసీ షాక్!
TS: లోక్ సభ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డికి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. శ్రీరామ నవమి - భద్రాద్రి సీతారామచంద్రస్వామి వారికి సీఎం రేవంత్ రెడ్డి పట్టువస్త్రాల సమర్పణకు, కళ్యాణ మహోత్సవ ప్రత్యక్ష ప్రసారానికి ఎలక్షన్ కమిషన్ నిరాకరించింది.
New Update
Advertisment