/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/ec-1-jpg.webp)
Election Commission : త్వరలోనే దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు(Lok Sabha Elections) జరగనున్న నేపథ్యంలో కొందరు ఆకతాయిలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. దీని గురించి ఎన్నికల సంఘం ఓ ప్రకటన విడుదల చేసింది. లోక్ సభ ఎన్నికలంటూ సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న షెడ్యూల్ తప్పుడు ప్రచారం అని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది.
లోక్ సభ ఎన్నికలు అంటే మామూలు విషయం కాదు. దాని గురించి ఇలా సోషల్ మీడియా(Social Media) లో వివరించం. దానికంటూ ఓ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రకటిస్తామని ఎన్నికల సంఘం వివరించింది. ఇలాంటి ఫేక్ న్యూస్ లను నమ్మే ముందు ఒకసారి ధృవీకరించుకోవాలని అధికారులు తెలిపారు.
దీని గురించి ట్విటర్ వేదికగా #VerifyBeforeYouAmplify అనే హ్యాష్ టాగ్ తో ఓ సందేశాన్ని పోస్ట్ చేసింది. కొందరు ఆకతాయిలు మార్చి 28 నుంచి నామినేషన్ల స్వీకరణ అని, ఏప్రిల్ 19 న పోలింగ్ అని, మే 22 న ఓట్ల లెక్కింపు అని , మే 30 న కొత్త ప్రభుత్వం ఏర్పాటు అంటూ వార్తలు షికారు చేస్తున్నాయి.
అసలు అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections) కానీ, లోక్ సభ ఎన్నికలు కానీ ప్రకటించే సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం(EC) కచ్చితంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి అన్ని వివరాలను వెల్లడిస్తుంది. ఏయే రాష్ట్రాల్లో ఎప్పుడూ ఎన్నికలు జరుగుతాయి, ఏఏ తేదీల్లో ఎన్నికలు ఉంటాయి, ఓట్ల లెక్కింపు ఎప్పుడూ అనేది , నామినేషన్ల ప్రక్రియ ఎప్పుడూ , ఓటర్లు ఎంత మంది ఉన్నారు, పోలింగ్ ఏర్పాట్లు, సిబ్బంది వివరాలు ఇలా ఇన్ని విషయాలను తెలియజేస్తారు.
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలను ప్రజలెవరు నమ్మోద్దని ఈసీ కోరింది. ఏప్రిల్- మే నెలల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం రంగం సిద్దం చేస్తుంది. అతి త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేస్తామని తెలిపింది. కొన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే ప్రచారాలను కూడా షూరు చేశాయి.
ఇప్పటికే 195 మందితో బీజేపీ తొలి జాబితాను విడుదల చేయగా...కాంగ్రెస్ 36 మందితో తొలి జాబితాను విడుదల చేసింది.
Also Read : ఆస్ట్రేలియాలో లోయలో పడి తెలుగు వైద్యురాలు మృతి!
 Follow Us
 Follow Us