/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-27T190244.140.jpg)
టెలికాం దిగ్గజ కంపెనీ రిలయన్స్ జియో గురువారం కీలక ప్రకటన చేసింది. టారిఫ్ ప్లాన్స్‌పై 25 శాతం ధరలను పెంచినట్లు పేర్కొంది. గత రెండేళ్లలో ప్రీ పెయిడ్ ప్లాన్స్ ధరను పెంచడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం 28 రోజుల వాలిడిటీతో బేస్ ప్లాన్ 21.9 శాతం పెరిగి రూ.189గా ఉంది. ఇతర ప్లాన్స్ 12 నుంచి 25 శాతం వరకు పెరిగాయి. రోజుకి 1.5 జీబీ డేటా ప్లాన్ 25 శాతం పెరిగి రూ.239 అయ్యింది. ఇక వార్షిక ప్లాన్.. 20 శాతం పెరిగి ప్రస్తుతం రూ.3599గా ఉంది. ఈ కొత్త ప్లాన్లు జులై 3 నుంచి అందుబాటులో ఉండనున్నాయి.
Reliance Jio introduces new unlimited 5G plans to be available from 3rd July pic.twitter.com/TsDMAG682r
— ANI (@ANI) June 27, 2024