Cyber Crime : రూ. 49 లకే 48 కోడిగుడ్లు అంటూ.. 48 వేలు కాజేశారు!

4 డజన్ల కోడిగుడ్లను కేవలం రూ. 49 కే ఇస్తున్నామంటూ ఓ ఆన్‌ లైన్‌ మోసంతో బెంగళూరుకు చెందిన ఓ మహిళ తన ఖాతా నుంచి రూ. 48,199 లను పొగొట్టుకుంది. మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించింది.

Cyber Crime : రూ. 49 లకే 48 కోడిగుడ్లు అంటూ.. 48 వేలు కాజేశారు!
New Update

Eggs Scam : ప్రస్తుతం కోడి గుడ్లు(Eggs)  ధర రోజురోజుకి పెరుగుతూ ఉంది. డజన్ గుడ్లు సుమారు రూ.70 వరకు ఉంది. అలాంటిది రూ. 49 కి 48 గుడ్లు ఇస్తున్నామంటూ ఆన్‌ లైన్ మోసగాళ్లు సుమారు రూ. 48 వేల ను కాజేశారు. దీంతో మోసపోయామని గ్రహించిన సదరు మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన బెంగళూరులో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరు(Bengaluru) లోని వసంతనగర్‌ కు చెందిన ఓ మహిళ మొబైల్‌(Mobile) కు ఫిబ్రవరి 17న ఓ ఆన్‌ లైన్‌ షాపింగ్‌ కంపెనీ నుంచి ఓ ఈ-మెయిల్‌(Email) వచ్చింది. అందులో మీకు కేవలం రూ. 49 కే 48 గుడ్లు అంటూ ఓ మెసేజ్ వచ్చింది. దీంతో ఆమె తక్కువ ధరకే కోడిగుడ్లు వస్తున్నాయని అత్యాశకి పోయి ఆ లింక్‌ మీద క్లిక్‌ చేసింది.

అప్పుడు కోడిగుడ్లు కొనేందుకు రావాల్సిన ప్రొసెస్ అంతా వచ్చింది. అడ్రస్‌, ఫోన్‌ నెంబర్‌, బ్యాంక్‌ డిటైల్స్‌, క్రెడిట్‌ కార్డు నంబర్లు అన్ని ఇచ్చి పూరించింది. గుడ్లు ధర అయినటువంటి 49 రూపాయలు అకౌంట్‌ నుంచి కట్ అయ్యాయి. ఆ తరువాత కొద్దిసేపటికే ఆమె అకౌంట్‌ నుంచి రూ. 48,199 రూపాయలు కట్‌ అయినట్లు మరో మెసేజ్‌ వచ్చింది. .

దీంతో ఆమె మోసపోయినట్లు గుర్తించింది. వెంటనే బ్యాంకు అధికారులను సంప్రదించి తన కార్డును బ్లాక్‌ చేయించింది. ఆ తరువాత పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

గత కొంత కాలం నుంచి సైబర్‌ నేరగాళ్లు(Cyber Criminals) వివిధ పద్దతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. తప్పుడు సమాచారం పంపి లక్షల రూపాయలు తమ ఖాతాలోకి మార్చుకుంటున్నారు. అంతేకాకుండా అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ వంటి ఓటీటీల పేరు చెప్పి కూడా నేరగాళ్లు మోసం చేస్తున్నారు.
తక్కువ డబ్బులు కట్టి నెలంతా ఆ ఓటీటీని వాడుకోవచ్చు.. ఈ ఓటీటీ(OTT) ని వాడుకోవచ్చు అంటూ గెలం వేస్తున్నారు.

ఈ మెయిళ్లు, వాట్సాప్‌ సందేశాల ద్వారా వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. ఇలాంటి మెసేజ్‌ లు వస్తే వాటి పట్ల జాగ్రత్త వహించాలని పోలీసులు సూచిస్తున్నారు.

Also Read : ఇంటర్‌ పరీక్షల్లో కాపీ కొడితే.. క్రిమినల్‌ కేసే..విద్యార్థులకు అధికారుల హెచ్చరిక!

#bengaluru #cyber-crime #online-crime #eggs-scam
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe