ఎగ్స్ తినటం వల్ల కలిగే ఉపయోగాలు..

సవిలో శరీరంలోని పోషకాలు చెమట రూపంలో నశిస్తాయి. వాటిని భర్తీ చేయడానికి గుడ్లను డైట్‌లో చేర్చుకోవాలి. తద్వారా న్యూట్రియెంట్స్ రీప్లేస్ చేయవచ్చు. వేసవిలో ఎగ్స్ తింటే ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో తెలుసుకోండి.

New Update
ఎగ్స్ తినటం వల్ల కలిగే ఉపయోగాలు..

మనకు చౌకగా లభించే పోషక పదార్థాల్లో గుడ్లు ఒకటి. ఎగ్స్ పోషకాలకు పవర్ హౌస్‌గా చెప్పుకోవచ్చు. అందుకే వీటిని సూపర్ ఫుడ్ అంటారు. ఎదిగే పిల్లలకు ప్రతిరోజూ ఒక గుడ్డు ఆహారంగా పెట్టాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. అలాగే వేసవిలో తప్పనిసరిగా వీటిని డైట్‌లో చేర్చుకోవాలని సలహా ఇస్తున్నారు. ఎందుకంటే వేసవిలో శరీరంలోని పోషకాలు చెమట రూపంలో నశిస్తాయి. వాటిని భర్తీ చేయడానికి గుడ్లను డైట్‌లో చేర్చుకోవాలి. తద్వారా న్యూట్రియెంట్స్ రీప్లేస్ చేయవచ్చు. వేసవిలో ఎగ్స్ తింటే ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో తెలుసుకోండి.

* గుండెకు మంచివి

గుండె ఆరోగ్యాన్ని కాపాడే ఆహారాల్లో గుడ్లు ఒకటి. వీటిలో అసంతృప్త కొవ్వులు ఉంటాయి. ముఖ్యంగా మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, శరీరంలో చెడు కొవ్వును తగ్గిస్తాయి.

* ఎముకలు బలోపేతం

ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే వేసవిలో గుడ్లను డైట్‌లో చేర్చుకోవాలి. వీటిలో విటమిన్ డి ఉంటుంది. ఇది కాల్షియం శోషణను మెరుగుపరుస్తుంది. దీంతో ఎముకలు, కీళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎముక పగుళ్లు, బోలు ఎముకల వ్యాధి ముప్పు తగ్గుతుంది.

* వెయిట్ మేనేజ్‌మెంట్

గుడ్లలో ప్రోటీన్‌ కంటెంట్ ఎక్కువగా, కేలరీలు తక్కువగా ఉంటాయి. గుడ్డు తెల్లసొనలో 50 శాతం ప్రోటీన్, పచ్చసొనలో 90 శాతం కాల్షియం, ఐరన్‌ ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారు బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్డు తింటే మధ్యాహ్నం సమయంలో అతి ఆకలి వేయదు. అలాగే పొట్ట ఎక్కువ సమయం నిండుగా ఉంటుంది. ఫలితంగా బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు.

* ఫోలిక్ యాసిడ్

గుడ్లలో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది పిండం ఎదుగుదలకు అవసరమైన ముఖ్యమైన పోషకం. స్పైనా బిఫిడా వంటి పుట్టుకతో వచ్చే లోపాలను ఫోలిక్ యాసిడ్ నివారిస్తుంది. అందుకే గర్భవతులు రెగ్యులర్‌గా ఎగ్స్ తినడం మంచిది.

* చర్మ ఆరోగ్యం

వేసవిలో ఎండల తీవ్రతకు చర్మం బాగా కమిలిపోతుంది. ఉక్కపోత కారణంగా దురద, పొక్కులు వంటి చర్మ సంబంధ సమస్యలు తలెత్తవచ్చు. అయితే ఎగ్స్‌లోని సమ్మేళనాలు వేసవిలో చర్మ ఆరోగ్యాన్ని కాపాడగలవు. వీటిలో ఉండే విటమిన్లు, మినరల్స్ చర్మం సహజత్వాన్ని కాపాడుతాయి. శరీర కణజాలాల విచ్ఛిన్నతను నిరోధిస్తాయి.

* ప్రోటీన్‌ ఫుడ్

గుడ్లలో ప్రోటీన్‌ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. శరీరానికి అవసరమైన పోషకాల్లో ఇది ముఖ్యమైనది. ప్రోటీన్ శరీర కండరాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కండర ద్రవ్యరాశి నిర్మాణం, నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తుంది, రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. శరీరంలో సంతృప్తి స్థాయిని ప్రోత్సహించడానికి ప్రోటీన్ అవసరం. వేసవిలో అలసట సర్వసాధారణం. దీన్ని పోగొట్టి శరీరాన్ని చురుకుగా ఉంచడానికి ప్రోటీన్‌ అవసరం.

* కంటి ఆరోగ్యం

వేసవిలో ఎండలు తీవ్రంగా ఉంటాయి. పనుల నిమిత్తం బయటకు వెళ్లినప్పుడు సూర్యరశ్మి ప్రభావం కంటి మీద పడుతుంది. అయితే గుడ్లలో లుటీన్, జియాక్సంతిన్ అనే యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యంలో కీలకపాత్ర పోషిస్తాయి. UV కిరణాల నుంచి కంటిని రక్షిస్తాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు