Egg Prices: కొండెక్కి కూర్చున్న కోడిగుడ్డు ధర..ఏడాది చివరిలో ఆల్ టైం రికార్డు!

కార్తీక మాసం ముగియడంతో కోడిగుడ్డు ధరలు కొండెక్కి కూర్చున్నాయి. నిన్నటి వరకు విశాఖలో ఒక్కో కోడి గుడ్డు ధర రూ. 5.80 లుగా ఉన్న ధరలు నేటి నుంచి రూ. 1.20 పెరిగి రూ. 7 గా ఉంది.

Egg Prices: కొండెక్కి కూర్చున్న కోడిగుడ్డు ధర..ఏడాది చివరిలో ఆల్ టైం రికార్డు!
New Update

నిన్నటి వరకు కార్తీక మాసం(Karthika masam)  పుణ్యమా అంటూ కూరగాయల ధరలు కొండెక్కి కూర్చుంటే..ఇప్పుడు నాన్ వెజ్‌ ఐటమ్స్‌(Non Veg items) ధరలు ఆకాశనంటుతున్నాయి. తాజాగా కోడిగుడ్డు (Egg)  ధర చుక్కల్లో చేరింది. రోజుకో కోడిగుడ్డు ధర తినాలని డాక్టర్స్ చెబుతుంటే..ధరలు మాత్రం అందకుండా ఉంటున్నాయి.

గుడ్డు తినడం వల్ల ఎన్నో లాభాలున్నాయని మనందరికీ తెలిసిందే. ఇప్పుడు కార్తీక మాసం పూర్తి కావడంతో పాటు..మరి కొద్ది రోజుల్లో క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ వేడుకలు రాబోతున్నాయి. దీంతో కోడిగుడ్డు ధర పైకి లేచింది. నిన్నటి వరకు రిటైల్‌ మార్కెట్ లో ఒక్కో గుడ్డు ధర రూ.6.50 నుంచి రూ. 7 కు పెరిగింది.

నిన్నటి వరకు విశాఖలో 100 కోడిగుడ్లు ధర 580 రూపాయలుగా ఉంది. నేటి నుంచి రిటైల్‌ మార్కెట్‌(Retail market)  కి వచ్చే సరికి రూ.7 కు అమ్ముతున్నారు. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటు పశ్చిమ బెంగాల్‌, నార్త్‌ ఇండియా నుంచి కూడా కోడి గుడ్లకు ఫుల్‌ డిమాండ్‌ పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.

గుడ్లలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అందుకే డాక్టర్స్ నిత్యం ఉడకబెట్టిన కోడిగుడ్లను తినాలని చెబుతుంటారు. ఒక గుడ్డులో 75 కేలరీలు, 7 గ్రాముల ప్రోటీన్‌, 5 గ్రాముల కొవ్వు, 1.6 గ్రాముల కొవ్వు, ఐరన్‌, విటమిన్స్‌, ఖనిజాలు ఉంటాయి.

శీతాకాలంలో చాలామంది కోడిగుడ్లను తినడానికి ఇష్టపడుతుంటారు. ఉడకబెట్టిన కోడిగుడ్లను ఎప్పుడు వడినా వెంటనే వాటిని తినాలి. ఉడకబెట్టిన గుడ్లను పొట్టు తీసి గంటల తరబడి బయట ఉంచితే అందులో హానికరమైన బ్యాక్టీరియా పెరుతుంది. అందుకని.. ఉడికించిన గుడ్లు పొట్టు తీసి కనీసం 2 గంటల్లోపు తింటే చాలా మంచిది. ఇలా తింటే బ్యాక్టీరియా పెరుగుదల తగ్గుతుంది.

గుడ్లు వండేటప్పుడు తక్కువ నూనె వేసుకోవాలి. ఎక్కువ నూనెను వేస్తే గుడ్లు ఉడికించడం వల్ల వాటి కేలరీలు, కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇలా వండిన కూర తింటే ఆరోగ్యానికి హానికరం. అందువల్ల, గుడ్లను ఎప్పుడూ తక్కువ నూనెలో ఉడికించి తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు అంటున్నారు.

గుడ్డును వండేటప్పుడు పూర్తిగా ఉడికించుకోవాలి. కొన్నిసార్లు ఉడకని గుడ్లు ఇన్ఫెక్షన్‌ను వ్యాప్తి చేసే హానికరమైన బ్యాక్టీరియాను రావచ్చు. గుడ్డును ఉడికించినప్పుడల్లా.. చిన్న మంటపై 10 నుంచి 15 నిమిషాలు ఉడికించాలి. ఇలా ఎక్కువసేపు ఉడికించడం వల్ల గుడ్డులోని బ్యాక్టీరియా మొత్తం చనిపోయి తినడానికి సురక్షితంగా ఉంటుంది.

ఒక గుడ్డులో 187 మి.గ్రా. కొలెస్ట్రాల్‌ ఉంటుంది. అయితే.. మటన్‌, ఐస్‌ క్రీం వంటి ఆహార పదార్థాలతో పోలిస్తే డైటరీ కొలెస్ట్రాల్‌ తక్కువగానే ఉంటుంది. అలాంటి అప్పుడు గుడ్డులోని పసుపుభాగం తినటం గురించి ఆందోళన పడాల్సిన పని లేదు. ప్రకృతి మనకు గుడ్డులో తెల్లసొన, పచ్చసొన కలిపే ఇచ్చింది కాబ్టటి కలిపే తినమని అర్థం.

Also read: రూ. 2 లకే నాయుడి గారి కుండ బిర్యానీ..ఎక్కడో తెలుసా!

#increases #egg #prices #all-time-record
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe