Viral Video: ఎండల ఎఫెక్ట్.. తరగతి గదినే స్విమ్మింగ్ పూల్ చేసేసిన టీచర్స్! కన్నౌజ్ జిల్లా మహసౌనపూర్ ఉమర్ద స్కూల్‌లో ఉపాధ్యాయులు చేసిన నెట్టింట వైరల్ అవుతుంది. ఎండల టెంపరేచర్‌కు ఉక్కరిబిక్కిరి అవుతున్న చిన్న పిల్లల కోసం తరగతి గదినే స్విమ్మింగ్ పూల్ చేసింది స్కూల్ టీచర్స్. ఆర్టిషియల్ స్విమ్మింగ్ పూల్‌గా మారిన క్లాస్‌రూంను చూడాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి. By Vijaya Nimma 01 May 2024 in Latest News In Telugu వైరల్ New Update షేర్ చేయండి Viral Video: తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాలలో ఎండలు మండిపోతున్నాయి. 42 డిగ్రీల టెంపరేచర్ దాటడంతో ప్రజలు ఉక్కరిబిక్కిరి అవుతున్నారు. అంతేకాదు బయటకు అడుగు పెట్టాలంటే భయపతున్నారు. పెద్దల ప్రరిస్థితే ఇలా ఉంటే ఇక చిన్న పిల్లలను పరిస్థితి దారుణం ఉంటుంది. ఎండల వేడిని తట్టుకోలేక వారి నరకం ఓ రేంజ్‌లో ఉంటుంది. పాపం ఏడుస్తున్న పిల్లల్ని చూసి తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడుతారు. అయితే ఈ ఎండలు తట్టుకోలే కొందరు స్మిమ్మింగ్ పూల్‌కి వెళ్తారు. ఉత్తరప్రదేశ్ విద్యా్ర్థుల కోసం ఓ టీచర్స్ చేసిన పనికి నెట్టింట తేగ వైరల్ అవుతుంది. ఎండలకు తట్టుకోలేని చిన్న పిల్లల కోసం తరగతి గదినే స్విమ్మింగ్ పూల్ చేసేసిన. స్కూల్ టీచర్స్ చేసిన ఆ పనికి నెట్టింట ప్రశంసలు అందుకుంటోంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by All India Radio News (@airnewsalerts) కన్నౌజ్ జిల్లా మహసౌనపూర్ ఉమర్ద స్కూల్ ఉంది. అయితే పిల్లలు సెలవులు ఇవ్వక ముందు ఎండల్లోనే బడికి వెళ్తున్నారు. కానీ ఆ వేడి ఎక్కువగా ఉడటం వలన పిల్లలు తట్టుకోలేక విలవిలలాడిపోతూ ఉన్నారు. పిల్లల ఇబ్బందిని చూసి టీచర్ క్లాస్ రూంను స్విమ్మింగ్ పూల్‌గా మారిస్తే బాగుంటుందని తోటి టీచర్‌తో చెప్పారు. ఈ విషయాన్ని టీచర్లందరికి చెప్పింది. దీంతో ఉపాధ్యాయులందరూ కలిసి ఓ నిర్ణయాన్ని తీసుకున్నారు. తరువాత తరగతి గదిలోని ఉన్న టేబుల్స్, చెయిర్స్ అన్ని తీసేసి గదిలో నీరు పోశారు. దీనిని ఆర్టిషియల్ స్విమ్మింగ్ పూల్‌గా మార్చేశారు. దీంతో పిల్లలు అంతా కేరింతలు కొడుతూ అందులో సంతోషంగా ఆడుకుంటూ ఉన్నారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతేకాకుండా టీచర్లపై ప్రశంసల జల్లు కురుస్తున్నారు. ఇలాంటి గురువులు అందరికీ ఉంటే బాగుండేదని కామెట్స్ చేస్తున్నారు. ఇది కూడా చదవండి: వెల్లుల్లి మాత్రమే కాదు, దాని తొక్క కూడా అదిరే లాభాలు గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. #viral-video మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి