CM Kejriwal: సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు

ఆఫ్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరోసారి షాక్ ఇచ్చింది ఈడీ. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ కి మరోసారి ఈడీ నోటీసులు పంపింది. విచారణకు రావాలి కోరింది. కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు పంపడం ఇది ఐదో సారి.

New Update
Kejriwal: కేజ్రీవాల్‌కు దక్కని ఊరట..ఈనెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

ED Issues Summons to CM Kejriwal: ఆఫ్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు (CM Kejriwal) మరోసారి షాక్ ఇచ్చింది ఈడీ (ED). ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam) కేసులో ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ కి మరోసారి ఈడీ నోటీసులు పంపింది. ఫిబ్రవరి 2న విచారణకు హాజరుకావాలని పేర్కొంది. కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు పంపడం ఇది ఐదో సారి. ఇప్పటికి వరకు ఈడీ విచారణకు సీఎం కేజ్రీవాల్ హాజరు కాలేదు. మరి ఈసారి విచారణకు హాజరు అవుతారా? లేదా? అనే ఉత్కంఠ దేశ రాజకీయాల్లో నెలకొంది.

బీజేపీపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు..

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) ని కూల్చేందుకు బీజేపీ(BJP) ప్రయత్నిస్తోందని అంటున్నారు. ఢిల్లీలో ఆపరేషన్ లోటస్‌కు బీజేపీ తెరతీస్తోందని కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే నన్ను అరెస్ట్ చేయిస్తామని మా ఎమ్మెల్యేలను బీజేపీ బెదిరిస్తోంది. అప్పుడు ఆప్ ప్రభుత్వం కూలిపోతుందని… దాని తర్వాత బీజేపీ పార్టీ నుంచి ఆప్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇస్తామని ప్రలోభ పెడుతున్నారు. తమ ఎమ్మెల్యేలు 7గురిని బీజేపీ కొనడానికి చూసిందని కేజ్రీవాల్ అంటున్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యేకు 25 కోట్లు ఇస్తామని ప్రలోభపెట్టిందని కేజ్రీవాల్ చెబుతున్నారు. ఇప్పటికే 21 మంది ఆప్ నేతలు తమ దగ్గర ఉన్నారని బీజేపీ చెబుతోందని కేజ్రీవాల్ అంటున్నారు. 

DO WATCH: 

Advertisment
తాజా కథనాలు