Navdeep Drugs Case :టాలీవుడ్ డ్రగ్స్ కేస్ లో నవదీప్ కు ఈడీ నోటీసులు

టాలీవుడ్ డ్రగ్స్ కేస్ లో నవదీప్ కు ఈడీ నోటీసులు పంపించింది. ఇప్పటికే రెండు సార్లు నోటీసులు ఇచ్చిన విచారణకు నవదీప్ విచారణకు హాజరు కాలేదు. మరోవైపు తాజాగా గుడిమల్కపుర్ డ్రగ్స్ కేస్ లో నవదీప్ ను నార్కోటిక్ పోలీసులు విచారించారు.

New Update
Navdeep Drugs Case :టాలీవుడ్ డ్రగ్స్ కేస్ లో నవదీప్ కు ఈడీ నోటీసులు

Navdeep Drugs Case: టాలీవుడ్ యాక్టర్ నవదీప్ చుట్టూ డ్రగ్స్ ఉచ్చు బిగుసుకుంటోంది. కొన్నిరోజుల క్రితం గుడిమల్కపుర్ డ్రగ్స్ కేస్ లో నవదీప్ ను నార్కోటిక్ పోలీసులు విచారించారు. విచారణకు హాజరు కావాలంటూ ఈడీ నోటీసులు పంపింది. ఇప్పటికే ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరీ (ED) రెండు సార్లు విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపినా....అతను హాజరు కాలేదు. దాంతో విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలంటూ మరోసారి ఈడీ నోటీసులు పంపింది. ఈ నెల 10న తమ ఎదుట హాజరు కావాల్సందిగా ఈడి నోటీసులు ఇచ్చింది. నార్కో టిక్‌ బ్యూరో (Narcotics Bureau) విచారణ ఆధారంగానే ఈ నోటీసులను ఈడీ ఇచ్చినట్టు తెలుస్తోంది. డ్రగ్స్‌ డీలర్స్‌, కస్టమర్లతో నవదీప్‌కి డైరెక్ట్‌ లింక్స్‌ ఉన్నాయని నార్కోటిక్, ఈడీ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో డ్రగ్స్‌ దందాలో ఆర్థిక లావాదేవీలపై ఈడీ ఆరా తీయనుంది.

మరోవైపు ఈ మధ్యనే హీరో నవదీప్ హైదరాబాద్ నార్కోటిక్ పోలీసు విచారణకు హాజరయ్యాడు. పార్కోటిక్ బృందం అతనిని 8 గంటలపాటూ విచారించింది. సెప్టెంబరు 14న తెలంగాణకు సంబంధించిన యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు, గుడిమల్కాపూర్ పోలీసు అధికారులతో కలిసి బెంగళూరుకు చెందిన ముగ్గురు నైజీరియన్ల సహా పలువురును అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా నుంచి కొకైన్ తో పాటూ పలు రకాల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ విచారణలోనే.. డ్రగ్స్ వ్యాపారులతో నవదీప్ సంప్రదింపులు జరిపినట్టుగా తమ విచారణలో తేలిందని అధికారులు వెల్లడించారు. అరెస్టైన నిందితుల్లో ఒకరైన రామచందర్​ దగ్గర నవదీప్ డ్రగ్స్ (Navdeep) కొనుగోలు చేసినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. నవదీప్ తో పాటూ తెలుగు సినీ నిర్మాతలు, పలువురు ప్రముఖులు ఈ కేసులో ఉన్నారు. ఇప్పటికే వెంకట్, బాలాజీ తో పాటూ మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అయితే నవదీప్ మాత్రం ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతూ వస్తున్నారు. డ్రగ్స్ విషయం బయటపడిన దగ్గర నుంచీ మాయం అయిపోయాడు. ఈ క్రమంలోనే నవదీప్ ముందు జాగ్రత్తగా బెయిల్ పిటీషన్ వేయగా హైకోర్టు దాన్ని తిరస్కరించింది. సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ నోటీసులు ఇచ్చి.. విచారణ చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. నవదీప్ కూడా పోలీసుల విచారణకు హాజరు కావాలని గట్టిగా చెప్పింది.

ఇప్పుడు ఈడీ కూడా నార్కోటిక్ బాటలోనే నడుస్తోంది. నార్కోటిక్ పోలీసుల ఇచ్చిన ఆధారాలతోనే నవదీప్ కు ఈడీ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది.

Also Read:పవన్ మునిగిపోయే పడవను లేపుతా అనడం విచిత్రం-అంబటి

Advertisment
Advertisment
తాజా కథనాలు