ED raids: హైదరాబాద్‌లో మాజీ క్రికెటర్ల ఇళ్లపై ఈడీ దాడులు.. లిస్ట్‌లో ఎవరున్నారంటే?

మాజీ క్రికెటర్లు శివలాల్ యాదవ్, అర్షద్ అయూబ్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు వినోద్‌పై ఈడీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం నిర్మాణంలో అవినీతికి సంబంధించి ఈడీ ఈసీఐఆర్ జారీ చేసింది.

ED raids: హైదరాబాద్‌లో మాజీ క్రికెటర్ల ఇళ్లపై ఈడీ దాడులు.. లిస్ట్‌లో ఎవరున్నారంటే?
New Update

ED Raids on Ex Cricketers: హైదరాబాద్‌ క్రికెట్ అసోసియేషన్‌(Hyderabad Cricket association) నిత్యం ఏదో ఒక నెగిటివ్‌ విధంగా వార్తల్లో నిలుస్తోంది. ఈ వార్తల్లో నిలిచే వారిలో ప్రస్తుత అసోసియేషన్‌ సభ్యులతో పాటు మాజీ సభ్యులు కూడా ఉంటారు. ఎవరు పాలించిన దొందుదొందే అన్న విధంగా హెచ్‌సీఏ తీరు ఉంటుంది. తాజాగా మారోసారి HCA న్యూస్‌లో నిలిచింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్‌లపై ఈడీ దాడులు చేసింది. మాజీ క్రికెటర్ శివలాల్ యాదవ్, అర్షద్ అయూబ్‌ ఇళ్లపై రైడ్స్‌ జరిగాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం నిర్మాణంలో అవినీతికి సంబంధించి తెలంగాణ అవినీతి నిరోధక శాఖ దాఖలు చేసిన మూడు చార్జిషీట్‌ల ఆధారంగా ఈడీ ఈసీఐఆర్‌ను జారీ చేసింది.

publive-image శివలాల్ యాదవ్

వివేక్‌ బ్రదర్‌ ఇంట్లోనూ సోదాలు
ఉప్పల్ స్టేడియం నిర్మాణంలో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు జీ. వినోద్ ఇంటిలో కూడా ఏకకాలంలో సోదాలు జరిగాయి. ఈ సోదాల్లో ముగ్గురి నుంచి అనేక పత్రాలు, బ్యాంకు ఖాతాల వివరాలను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు నవంబర్ 21న ఇటివలే కాంగ్రెస్ పార్టీలో చేరిన వినోద్ సోదరుడు వివేక్ వెంకటస్వామి ఇల్లు, కార్యాలయంలో ఈడీ ఆకస్మిక సోదాలు నిర్వహించింది.

Also Read: టీ20లకు రోహిత్ శర్మ వీడ్కోలు పలికినట్లేనా? వన్డే కెప్టెన్సీ కూడా వదులుకుంటాడా?

వివేక్ అనుచరుల ఇళ్లలో అధికారులు డబ్బులు సీజ్‌ చేశారు. ఆసిఫాబాద్ జిల్లాలో రూ.8 కోట్లు సీజ్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల చెన్నూరు బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ వివేక్ పై ఎన్నికల సంఘం, ఈడీకి ఫిర్యాదు చేశారు. డబ్బు సంచులతో చెన్నూరుకు వస్తున్నారని.. నేతలను కొనుగోలు చేస్తున్నట్లు ఆరోపిస్తూ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే బాల్క సుమన్ ఫిర్యాదుతో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు.

Also Read: ఐసీసీ టాప్‌ కిరీటాన్ని కింగ్‌ మళ్లీ అందుకుంటాడా? ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ విడుదల!

WATCH:

#cricket #ed-raids #hca #shivlal-yadav
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe