MLC Kavitha : ఆ రూ.100 కోట్లు ఎక్కడివి?.. కవితపై ఈడీ ప్రశ్నల వర్షం!

ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ విచారణ రెండో రోజు కొనసాగుతోంది. ఆప్ ప్రభుత్వానికి ఇచ్చిన రూ.100 కోట్ల ముడుపులు ఎక్కడి నుంచి వచ్చాయి? లిక్కర్ స్కామ్ డీలింగ్‌తో వచ్చిన రూ. 192 కోట్లు ఏం చేశారు? అంటూ వరుస ప్రశ్నలతో అధికారులు కవితను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లు తెలుస్తోంది.

New Update
MLC Kavitha : ఆ రూ.100 కోట్లు ఎక్కడివి?.. కవితపై ఈడీ ప్రశ్నల వర్షం!

Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు(Delhi Liquor Scam Case) లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(BRS MLC Kavitha) ఈడీ(ED) విచారణ రెండో రోజు కొనసాగుతోంది. ఆమెపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తోంది. నిన్నటి విచారణలో ఆమె చెప్పిన సమాధానాల ఆధారంగా ఈ రోజు ప్రశ్నలను మార్చినట్లు కూడా సమాచారం. ఈ రోజు ఆమెను అడుగుతున్న ప్రశ్నలు ఈ కింది విధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
1. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మీ పాత్ర ఏంటి?
2. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ(Delhi Excise Policy) లో టెండర్ల కోసం ఆప్ ప్రభుత్వానికి(AAP Government).. ఇచ్చిన రూ.100 కోట్ల ముడుపులు ఎక్కడి నుంచి వచ్చాయి?
3. ఆ 100 కోట్ల రూపాయలు మీకు ఎవరెవరు సమకూర్చారు?
4. లిక్కర్ స్కామ్ డీలింగ్‌తో వచ్చిన రూ. 192 కోట్లు ఏం చేశారు?
5. సౌత్ గ్రూప్‌తో మీకేం సంబంధం?
ఇది కూడా చదవండి: Telangana: ఎమ్మెల్యే దానంపై వేటుకు బీఆర్‌ఎస్‌ ప్రయత్నాలు

6. ఢిల్లీ, హైదరాబాద్‌(Hyderabad) లో జరిగిన సమావేశాల్లో పాల్గొన్నారా?
7. కేజ్రీవాల్, సిసోడియాతో చర్చలు జరిపారా?
8. రామచంద్రపిళ్లైతో మీకున్న సంబంధం ఏంటి?
9. రామచంద్రపిళ్లైకి కోటి రూపాయలు ఎందుకు ఇప్పించారు?

10. ఫోన్లు ఎందుకు ధ్వంసం చేశారు?
11. చాటింగ్ ఎందుకు డిలీట్ చేశారు?
వీటితో పాటు ఈడీ అధికారులు తాము ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు ముందు పెట్టి కవితను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 20కి పైగా ప్రశ్నలను ఈ రోజు విచారణలో అడిగి వాటికి సమాధానాలను రాబట్టలని ఈడీ భావిస్తోంది.

Advertisment
తాజా కథనాలు