MLA Mahipal Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు.. 1.2కేజీల బంగారం సీజ్

TG: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి బ్యాంక్‌ లాకర్లలో ఈడీ సోదాలు నిర్వహించారు. పటాన్‌చెరులోని SBIబ్యాంక్‌లో ఎమ్మెల్యే లాకర్లను ఓపెన్‌ చేయించారు అధికారులు. PMLA కేసులో 1.2కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

New Update
MLA Mahipal Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు.. 1.2కేజీల  బంగారం సీజ్

MLA Mahipal Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి బ్యాంక్‌ లాకర్లలో ఈడీ (ED) సోదాలు నిర్వహించారు. పటాన్‌చెరులోని SBIబ్యాంక్‌లో ఎమ్మెల్యే లాకర్లను ఓపెన్‌ చేయించారు అధికారులు. PMLA కేసులో 1.2కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మహిపాల్‌రెడ్డి కొనుగోలు చేసిన గోల్డ్‌ బిస్కెట్స్‌కు ఎలాంటి రసీదులు, డాక్యుమెంట్స్‌ లేవని ఈడీ అధికారులు తెలిపారు. ఎమ్మెల్యే కుటుంబసభ్యులు, పలు బినామీ కంపెనీలకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ ఆస్తులకు సంబంధించి 100 డాక్యుమెంట్స్‌ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మైనింగ్‌ అక్రమాలు, బినామీ వ్యాపారాలు, నిధుల మళ్లింపుకు సంబంధించి మహిపాల్‌రెడ్డి, ఆయన సోదరుడిని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. అక్రమ మైనింగ్‌ ఆరోపణలతో మనీలాండరింగ్‌ కేసులో ఈడీ దర్యాప్తు చేస్తోంది.

Also Read: పెళ్ళైనా ఆగని ప్రియుడి వేధింపులు.. ప్రాణాలు తీసుకున్న ప్రియురాలు!

Advertisment
తాజా కథనాలు