సీఎం హేమంత్ సోరెన్ కు ఈడీ షాక్... మరోసారి సమన్లు పంపిన దర్యాప్తుసంస్థ....!

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కు మరోసారి షాక్ తగిలింది. భూకబ్జాకు సంబంధించిన కేసులో ఆయనకు తాజాగా ఈడీ మరోసారి నోటీసులు పంపింది. ఈ కేసులో అగస్టు 24న విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. అంతకు ముందు ఈ నెల 14న విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది గతంలో అక్రమ మైనింగ్ కేసులో జార్ఖండ్ లోని కార్యాలయంలో ఆయన్ని ఈడీ ప్రశ్నించింది.

author-image
By G Ramu
Hemanth Soren: ఇక ప్రజా సేవలోనే-హేమంత్ సోరెన్
New Update

ED issues summons to Jharkhand CM Hemant Soren: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కు మరోసారి షాక్ తగిలింది. భూకబ్జాకు సంబంధించిన కేసులో ఆయనకు తాజాగా ఈడీ మరోసారి నోటీసులు పంపింది. ఈ కేసులో అగస్టు 24న విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. అంతకు ముందు ఈ నెల 14న విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. కానీ ముందస్తుగా షెడ్యూల్ చేసిన కార్యక్రమాల నేపథ్యంలో తాను విచారణకు హాజరు కాలేనని వెల్లడించారు.

విచారణకు హాజరయ్యేందుకు తనకు మరి కొంత సమయం కావాలని ఈడీని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయనకు మరోసారి ఈడీ సమన్లు పంపింది. గతంలో అక్రమ మైనింగ్ కేసులో జార్ఖండ్ లోని కార్యాలయంలో ఆయన్ని ఈడీ ప్రశ్నించింది. ఈ కేసులో ఆయనతో పాటు ఆయన సతీమణిపై ఈడీ పది గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించింది.

భూకబ్జా కేసుకు సంబంధించి ఇప్పటికే 13 మందిని ఈడీ అదుపులోకి తీసుకుంది. ఇందులో ఓ ఐఏఎస్ అధికారి కూడా ఉండటం గమనార్హం. ఇదే కేసులో గత నెల 8న సీఎం సన్నిహితుడు, ఎమ్మెల్యే పంకజ్ మిశ్రా (MLA Pankaj Mishra) నివాసంలో ఈడీ దాడులు చేసింది. దాడుల్లో సీఎం హేమంత్ సోరెన్ కు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ తో లింక్ ఉన్న చెక్ బుక్ ను ఈడీ స్వాధీనం చేసుకుంది.

చెక్ బుక్ దొరకడంతో ఈ కేసులో సీఎం హేమంత్ సోరెన్ (CM Hemant Soren) పేరును కూడా ఈడీ చేర్చింది. అనంతరం పంకజ్ మిశ్రాను ఈడీ అరెస్టు చేసింది. ఈ కేసులో మరో ఆశ్చర్య కరమైన విషయాన్ని ఈడీ గుర్తించింది. ఈ కేసులో నిందితులు 1932 నాటి పత్రాలను ఉపయోగించి ప్రజల భూములను అన్యాయంగా స్వాధీనం చేసుకున్నారని ఈడీ అబియోగాలు మోపింది. దీనికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది.

ఆ భూములను ఇప్పటికే బాధితుల తాతలు తమకు అమ్మి వేశారన్ని బాధితులకు చెప్పారని ఈడీ పేర్కొంది. ఆర్మీకి లీజుకు ఇచ్చిన భూములను అలా తప్పుడు పత్రాలు సృష్టించి మోసపూరితంగా వాటిని స్వాధీనం చేసుకున్నారని పేర్కొంది. అనంతరం వాటిని వేరే వ్యక్తులకు విక్రయించారని తెలిపింది. వాటికి సంబంధించి భారీగా నకిలీ ధ్రువపత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ చెప్పింది.

Also Read: లడఖ్‎లో రాహుల్…బైక్ మీద రయ్ రయ్ మంటూ చక్కర్లు..!!

#ed #hemanth-soren #enforcement-directorate #cm-hemant-soren #jharkhand-cm #land-garabbing-case #ed-issues-summons-to-jharkhand-cm-hemant-soren #ed-summons-to-cm-hemant-soren
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe