Telangana: బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్.. రైతుబంధు పంపిణీకి బ్రేక్..

తెలంగాణలో ఎన్నికల సంఘం సంచలనం నిర్ణయం తీసుకుంది. ఇటీవలే రైతుబంధు పంపిణీకి అనుమతిచ్చిన ఎలక్షన్ కమిషన్ తాజాగా దీన్ని ఉపసంహరించుకుంది. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారనే ఆరోపణలతో రైతుబంధు పంపిణీ పర్మిషన్‌ను వెనక్కి తీసుకుంది.

New Update
Telangana: బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్.. రైతుబంధు పంపిణీకి బ్రేక్..

Rythu Bandhu Scheme: తెలంగాణలో ఎన్నికలు జరగనున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవలే ఈనెల 28లోపు రైతుబంధు పంపిణీకి అనుమతిచ్చిన ఈసీఐ.. తాజాగా దీన్ని వెనక్కి తీసుకొంది. ఎన్నికల కోడ్ నియమాలను ఉల్లంఘించారనే నేపథ్యంలో ఉపసంహరించుకున్నట్లు ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి నిధులు విడుదల చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇటీవల మంత్రి హరీష్‌రావు.. నవంబర్‌ 28న రైతు బంధు (Rythu Bandhu) డబ్బులు జమ చేస్తామని ప్రకటించడంతో దీన్ని పరిగణలోకి తీసుకున్న ఈసీఐ (ECI).. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని పేర్కొంటూ పర్మిషన్‌ను రద్దు చేసింది.

Also Read: ముగుస్తున్న ఎక్సైజ్‌ పాలసీ గడువు.. తక్కువ ధరలకు మద్యం అమ్మితే రూ.4 లక్షలు జరిమానా

ఇదిలా ఉండగా.. రాష్ట్రంలోయాసంగి సీజన్‌ ప్రారంభానికి ముందు రైతుబంధు నిధులు విడుదల చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా.. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ప్రభుత్వం నుంచి యాసంగి సీజన్‌కు నిధుల జమ కాలేదు. ఇది కొనసాగుతున్న పథకమని కోడ్‌ వర్తించదని.. యథావిధిగా రైతుబంధు పంపిణీకి అనుమతించాలని రాష్ట్ర సర్కార్ గత నెలలో ఈసీని కోరుతూ లేఖ రాసింది. అయితే దీన్ని పరిశీలించిన ఈసీ మూడు రోజుల క్రితం రైతుబంధు పంపిణీకి పర్మిషన్ ఇచ్చింది. 28 సాయంత్రానికి ప్రచార గడువు ముగియనందున.. అప్పటి నుంచి ఈ నెల 30న పోలింగ్‌ ముగిసే వరకు నిధులను జమ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. కానీ ఇప్పుడు ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారనే ఆరోపణలతో.. ఈ అనుమతిని ఎన్నికల సంఘం ఉపసంహరించుకుంది. దీంతో రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులకు రైతుబంధు ఆర్థికసాయం నిలిచిపోనుంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు