Lok Sabha Elections 2024: రేపే తెలుగు రాష్ట్రాల్లో ఎంపీ ఎన్నికల నోటిఫికేషన్.. నామినేషన్ల జాతర షురూ! దేశవ్యాప్తంగా 4వ విడత ఎన్నికల నోటిఫికేషన్ గురువారం రిలీజ్ కానుంది. ఏప్రిల్ 18న ఏపీ, తెలంగాణతోపాటు మొత్తం 96 లోకసభ స్థానాలకు నోటిఫికేషన్ ఇవ్వనుంది ఈసీ. మార్చి 16 నుంచి దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. By Bhoomi 17 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం New Update షేర్ చేయండి AP and Telangana Lok Sabha Election Nominations: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నిలకు సమయం దగ్గరపడింది. మొత్తం 7 దశల్లో దేశంలోని అన్ని లోకసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మార్చి 16న సీఈసీ రాజీవ్ కుమార్ సార్వత్రిక ఎన్నికలు 2024 షెడ్యూల్ విడుదల చేయడంలో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని విధాలుగా ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. ఏప్రిల్ 19న తొలి దశ పోలింగ్ జరుగుతుంది. లోక్‌సభ ఎన్నికలకుగానూ ఇదివరకే 3 దశల ఎన్నికల నోటిఫికేషన్లు రిలీజ్ చేసింది ఎన్నికల సంఘం . రేపు (ఏప్రిల్ 18న)4వ దశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ఏర్పాట్లు చేస్తోంది. నాల్గవ దశలో 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతోపాటు 96 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) (25 స్థానాలు), తెలంగాణ (17), బిహార్ (5), ఝార్ఖండ్ (4), మధ్యప్రదేశ్ (8), మహారాష్ట్ర (11), ఒడిశా (4), ఉత్తర్ ప్రదేశ్ (13), పశ్చిమ బెంగాల్ (8), జమ్మూకాశ్మీర్ (1). గురువారం ఏపీ, తెలంగాణలో ఎన్నికలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యింది. అదే రోజు నుంచి అంటే 18 నుంచే అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఏప్రిల్ 25 వరకూ నామినేషన్లు దాఖలుకు గడువు ఇచ్చింది ఈసీ. ఇక ఈ 26న నామినేషన్ల పరిశీలన చేపడతారు. చివరికి ఈ29న నామినేషన్ల ఉప సంహరణతో ఈ ప్రక్రియ ముగుస్తుంది. నాలుగో దశలో ఏపీ, తెలంగాణలలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ స్థానాలకు, తెలంగాణలో (Telangana) లోక్‌సభ ఎన్నికలతో పాటు ఖాళీ అయిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి ఇదే దశలో పోలింగ్ జరుగుతుంది. జూన్ 4 న ఓట్లు లెక్కించి, విజేతలను ప్రకటిస్తుంది ఎన్నికల సంఘం. గురువారం ఏపీ, తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్: ఎన్నికల నోటిఫికేషన్ జారీ - ఏప్రిల్ 18 నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం - ఏప్రిల్ 18 నామినేషన్లు దాఖలుకు తుది గడువు - ఏప్రిల్ 25 నామినేషన్ల పరిశీలన - ఏప్రిల్ 26 నామినేషన్ల ఉప సంహరణ - ఏప్రిల్ 29 ఏపీ, తెలంగాణలో ఎన్నికలు - మే 13 ఓట్ల లెక్కింపు, విజేతల ప్రకటన - జూన్ 4 ఇది కూడా చదవండి: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కేఏ పాల్ సాంగ్ #andhra-pradesh #telangana #ap-elections-2024 #lok-sabha-elections-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి