AP : ఏపీ అల్లర్లపై ఈసీ సంచలన నిర్ణయం.. సిట్‌ దర్యాప్తుకు ఆదేశం!

ఎన్నికల వేళ ఏపీలో కొనసాగుతున్న అల్లర్లపై ఈసీ సీరియస్ యాక్షన్ తీసుకోనుంది. ఎన్నికల ముందు, తర్వాత జరిగిన హింసపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని, రెండు రోజుల్లో పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

AP : ఏపీ అల్లర్లపై ఈసీ సంచలన నిర్ణయం.. సిట్‌ దర్యాప్తుకు ఆదేశం!
New Update

EC Serious Action On AP Issues : ఏపీలో ఎన్నికల(AP Elections) వేళ కొనసాగుతున్న అల్లర్లపై కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission) సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎన్నికల ముందు, తర్వాత జరిగిన హింసపై ఈసీ ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేయనుంది. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ప్రతి హింసాత్మక ఘటనపైనా సిట్ నివేదిక ఇవ్వనుంది.

ఈ మేరకు ఏపీలోని పల్నాడు, మాచర్ల(Macherla), నరసరావుపేట, తిరుపతి, చంద్రగిరి, తాడిపత్రి ఘటనలపై సిట్‌ విచారణ జరపనుంది. విశాఖలో జరిగిన ఘటననూ సిట్‌ పరిధిలోకి తెచ్చేందుకు అధికారులు ఆలోచిస్తున్నారు. తాడిపత్రి ఘటనలో చైతన్య తన పరిధి దాటి వ్యవహరించారని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ కోణంలో సిట్‌ దర్యాప్తుతోపాటు ప్రతి ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్‌ నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇందుకు సంబంధించి రెండు రోజుల్లో నివేదిక సమర్పించాలని ఈసీ ఆదేశించింది.

Also Read : ఏ పార్టీ గెలిచినా పవర్ సెంటర్ పిఠాపురమే! ఎందుకో తెలుసా..

#serious-action #election-commission #sit #ap-issues
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe