EC: ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ వాయిదా!

మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కు సంబంధించిన కౌంటింగ్ ను జూన్ 2 కు వాయిదా వేశారు. ఎంపీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో కౌంటింగ్ ను వాయిదా వేయాలని కలెక్టర్ కు ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

EC: ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ వాయిదా!
New Update

Mahabubnagar MLC Counting Postponed: మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ను వాయిదా వేసింది ఈసీ (Election Commission). ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ చేపడితే ఆ ప్రభావం లోక్ సభ ఎన్నికలపై (Lok Sabha Elections) పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈసీ కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో జూన్ 2న మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ నిర్వహించనున్నారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి.. కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

దీంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈసీ ఈ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసింది. కాంగ్రెస్‌ నుంచి మన్నె జీవన్‌రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్‌కుమార్‌రెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్థిగా సుదర్శన్‌గౌడ్‌ పోటీలో ఉన్నారు. మార్చి 28న ఈ ఉప ఎన్నిక నిర్వహించగా మొత్తం 1,439 మంది ఓటర్లకు గానూ.. 1437 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సైతం ఓటు వేశారు.

ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు ఓటర్లను సుదూర ప్రాంతాలకు తరలించి క్యాంపులు నిర్వహించాయి. అయితే.. ఈ ఎన్నికల్లో 200 ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలు సైతం విజయం తమదేనని ధీమాగా ఉన్నారు.

Also Read: తెలంగాణలో కరవు.. ప్రభుత్వంపై కిషన్‌రెడ్డి ఆగ్రహం!

#lok-sabha-elections-2024 #mahabubnagar #election-commission
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe