EC : పెన్షన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు పింఛన్ దారులకు ఇబ్బంది లేకుండా సకాలంలో పెన్షన్లను అందించాలని ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో పెన్షన్ దారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. By Bhavana 27 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Election Commission : పింఛన్ దారులకు ఇబ్బంది లేకుండా సకాలంలో పెన్షన్ల(Pensions) ను అందించాలని ఏపీ(Andhra Pradesh) ప్రభుత్వానికి ఈసీ(EC) ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్(Election Code) అమల్లో ఉన్న నేపథ్యంలో పెన్షన్ దారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. పింఛన్ తో పాటు , నగదు బదిలీ పథకాలకు సంబంధించి మార్చి 30న జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని తెలిపింది. తమ మార్గదర్శకాలను వాస్తవిక దృష్టితో ఆలోచించి అమలు చేయాలని సీఎస్ జవహర్ రెడ్డికి స్పష్టం చేసింది. పెన్షన్ల పంపిణీ చేయడానికి శాశ్వత ఉద్యోగులను మాత్రమే వినియోగించుకోవాలని ఈసీ పేర్కొంది. వాలంటీర్లకు బదులు పెన్షన్లను పంపిణీ చేసేందుకు ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకోవాలని తెలిపింది. ఏపీలో పింఛన్ల పంపిణీ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై చాలా ఫిర్యాదులు వచ్చాయని తెలిపింది. లబ్ధిదారులు కూడా చాలా ఇబ్బందులకు గురైనట్టు తమ దృష్టికి వచ్చిందని వెల్లడించింది. శాశ్వత ఉద్యోగులు, ఎలక్ట్రానిక్ విధానాల ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంపిణీ చేయవచ్చని గత మార్గదర్శకాల్లోనే సూచించామని తెలిపింది. Also read: పిఠాపురంలో కోట్ల విలువైన మద్యం సీజ్..! #andhra-pradesh #govt #pensions #ap-election-commission మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి