Telangana Elections: కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలపై ఈసీ సీరియస్‌.. అధికారులకు కీలక ఆదేశం..

నిన్న(మంగళవారం) ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కౌషిక్ రెడ్డి.. తనకు ఓట్లేసి గెలిపిస్తే విజయ యాత్ర.. లేకపోతే నా శవయాత్ర అని చేసి వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం స్పందించింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని హుజురాబాద్ ఎన్నికల అధికారులను ఆదేశించింది.

Telangana Elections: కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలపై ఈసీ సీరియస్‌.. అధికారులకు కీలక ఆదేశం..
New Update

తెలంగాణలో మంగళవారం ఎన్నికల ప్రచారం ముగిసిన సంగతి తెలిసిందే. అయితే నిన్న ఎన్నికల ప్రచారంలో భాగంగా హుజురాబాద్ బీఆర్ఎస్‌ అభ్యర్థి కౌషిక్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశాడు. మీకు దండం పెడతా ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ ఓటర్లను వేడుకున్నారు. తనకు ఓట్లేసి గెలిపిస్తే విజయ యాత్రకు వస్తానని.. లేకపోతే డిసెంబర్ నాలుగో తేదీ నా శవయాత్రకు మీరు రండి అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఆయన చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. దీంతో కౌషిక్‌ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం సీరియస్‌ అయ్యింది. ఈ వ్యాఖ్యలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని హుజురాబాద్ ఎన్నికల అధికారులను ఆదేశించింది.

Also Read: ఎన్నికల సందర్బంగా దేవాలయాల బాట పడుతున్న అగ్ర నేతలు

ఇదిలాఉండగా.. ఇటీవల కౌశిక్‌ రెడ్డి తరపున తన కూతురు శ్రీనిక చేసిన ప్రచారం కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. హుజురాబాద్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో.. తన తండ్రిని గెలిపిస్తే హుజురాబాద్‌కు 2 వేల కోట్లు తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరోవైపు హుజురాబాద్‌ నుంచి బీజేపీ తరపున ఈటల రాజేంధర్‌ పోటీ చేస్తున్నారు. మొన్న జరిగిన ఉపఎన్నికల్లో కౌశిక్ రెడ్డి ఈటల చేతిలో ఓడిపోయారు. అయితే ఈసారి హుజురాబాద్‌ ప్రజలు ఎవరిని గెలిపిస్తారో తెలియాలంటే డిసెంబర్ 3 వరకు ఆగాల్సిందే.

Also Read: కరీంనగర్ లో అర్ధరాత్రి హైటెన్షన్..పోలీసులతో బండి సంజయ్ వాగ్వాదం

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe