ఈసీ కీలక నిర్ణయం.... శరద్ పవార్, అజిత్ పవార్ వర్గాలకు మరో మూడు వారాల గడువు....!

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) పేరు, అధికారిక గుర్తుకు సంబంధించిన నోటీసులపై సమాధానం ఇచ్చేందుకు మరి కొంత గడువు కావాలన్న శరద్ పవార్ వర్గం నేతల లేఖపై ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించింది. ఎన్సీపీలోని ఇరు వర్గాల నేతలకు మరో మూడు వారాల గడువు ఇస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.

author-image
By G Ramu
New Update

సెప్టెంబర్ 8 లోగా నోటీసులకు సమాధానాలు ఇవ్వాలని ఆదేశించింది. ఇటీవల ఎన్సీపీలో అజిత్ పవార్ తిరుగుబాటు జెండా ఎగుర వేశారు. తన వైపు వున్న ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన ఏక్ నాథ్ షిండే సర్కార్ కు మద్దతు ఇచ్చారు. ఈ క్రమంలో ఏక్ నాథ్ షిండే సర్కార్ లో ఆయనకు డిప్యూటీ సీఎం పదవి లభించింది.

ఆయన మద్దతు దారులకు కూడా రాష్ట్ర మంత్రి వర్గంలో కీలక పదవులు లభించాయి. ఇక అసలైన ఎన్సీపీ తమదేనని ఇరు వర్గాలు వాదనలకు దిగాయి. దీంతో సమస్య ఎన్నికల సంఘాన్ని చేరింది. ఈ క్రమంలో గత నెల 27న శరద్ పవార్, అజిత్ పవార్ వర్గాలకు ఎన్నికల సంఘం నోటీసులు పంపింది.

నోటీసులకు అగస్టు 17లోగా సమాధానం ఇవ్వాలని ఇరు వర్గాలను ఆదేశించింది. ఇది ఇలా వుంటే జూలై3న అజిత్ పవార్ తో పాటు రెబెల్ ఎమ్మెల్యేలపై శరద్ పవార్ వర్గం అనర్హత వేటు తీర్మానాన్ని ప్రవేశ పెట్టింది. అనంతరం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్, జనరల్ సెక్రటరీ సునీల్ తత్కరేతో సహా తొమ్మిది ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు