Breaking: TS MLC Election: త్వరలో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నిక.. ప్రాసెస్ స్టార్ట్ చేసిన ఈసీ!

ఖమ్మం, వరంగల్‌, నల్గొండ జిల్లాల్లో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు వివరించారు. ఈ క్రమంలోనే ఓటర్ల జాబితా షెడ్యూల్‌ ని కూడా విడుదల చేసింది ఈసీ.

New Update
Kadapa: ఆర్టీసీ కండక్టర్, వార్డు వాలంటీర్ పై ఈసీ వేటు..!

తెలంగాణలో పల్లా రాజశేఖర్‌ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తుంది. దీనికి సంబంధించి శుక్రవారం నాడు ఓటర్ల జాబితా షెడ్యూల్‌ ని కూడా విడుదల చేసింది. ఖమ్మం, నల్గొండ, వరంగల్‌ ఎమ్మెల్సీ స్థానాలకు ఓటరు జాబితా షెడ్యూల్‌ ను తెలిపింది.

ఈ మూడు జిల్లాల్లోని ఎమ్మెల్సీ స్థానాలు కొంత కాలం క్రితం ఖాళీ అవ్వడంతో ఎన్నికలకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది ఎన్నికల సంఘం. ఫిబ్రవరి 6 వ తేదీ వరకు ఓటర్‌ నమోదుకు అవకాశం కల్పించగా, ఫిబ్రవరి 24న డ్రాఫ్ట్‌ ఓటర్‌ లిస్ట్‌ ను విడుదల చేయనుంది. ఈక్రమంలోనే ఫిబ్రవరి 24 నుంచి మార్చి 14 వరకు కూడా అభ్యంతరాల స్వీకరణ కార్యక్రమం ఉంటుందని ఈసీ వివరించింది.

ఏప్రిల్‌ 4న ఫైనల్‌ ఓటర్‌ లిస్ట్‌ ను విడుదల చేస్తామని ప్రకటించింది. ఏప్రిల్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశాలున్నాయి. జూన్ 8వ తేదీ లోపు పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నిక ఉంటుందని ఈసీ వివరించింది.

Also read: బీసీల అభివృద్ధి చూడలేక అగ్రవర్ణాలు జగన్ పై పగబట్టారు: ఆర్‌. కృష్ణయ్య!

Advertisment
తాజా కథనాలు