Election Commission : ఏపీ ఎన్నికలు(AP Elections) సమీపిస్తున్న తరుణంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఏపీలోని వాలంటీర్ల(Volunteers) మీద ఎలక్షన్ కమిషన్(EC) ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే...ఓటర్లతో ప్రత్యక్ష సంబంధాలున్న వాలంటీర్లు పెన్షన్ల పేరుతో, రేషన్ పేరుతో ఓటర్ల వద్దకు వెళ్తుండడంతో ఇక నుంచి అలాంటివి కుదరవని ఈసీ తెల్చి చెప్పింది.
ప్రజలను అధికార పార్టీ వైపు ప్రభావితం చేసే విధంగా వాలంటీర్లు ప్రచారం చేస్తున్నారనే ఫిర్యాదులు రావడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ నెలలో ఇవ్వాల్సిన పించన్లను వాలంటీర్లు ఇవ్వొద్దని, పంచాయతీ కార్యాలయంలో పెన్షన్లను పంపిణీ చేయాలని ఈసీ తెలిపింది.
ఇప్పటికే వాలంటీర్ల వద్ద ఉన్న ప్రభుత్వ ట్యాబ్ లు, డేటా పరికరాలు, ఇతర డాక్యుమెంట్లను వెంటనే గ్రామ సచివాలయాల్లో సబ్ మీట్ చేయాలని ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కోడ్(Election Code) ఉన్న నేపథ్యంలో రేషన్ పంపిణీలో కూడా వాలంటీర్లు పాల్గొనవద్దని ఆదేశాలు జారీ చేసింది.
వీరి స్థానంలో వీఆర్వోలు మ్యాపింగ్(Mapping) చేసుకోవాలని తెలిపింది. అలాగే ఎండీయూ ఆపరేటర్లు కూడా వాలంటీర్లను రేషన్ పంపిణీ కార్యక్రమానికి పిలవకూడదని స్పష్టం చేసింది. ప్రభుత్వం ఇచ్చిన ఈఆర్డర్లను ఎవరైనా మితిమీరి ప్రవర్తిస్తే వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని ఈసీ పేర్కొంది.
Also Read : గ్యాస్ సిలిండర్ పై రూ.32 తగ్గింపు