Election Commission: ఎన్నికల వేళ ఈసీ సంచలన నిర్ణయం.. ఇకపై వారికి కూడా..

ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఓటు వేసే వృద్ధులు, వికలాంగులు, పేషెంట్లకు సహాయకులుగా వచ్చే వారికి కూడా ఇంక్ వేయాలని నిర్ణయించింది ఈసీ. ఈ సహాయకులకు కుడి చేతి చూపుడు వేలికి ఇంక్ వేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Elections : జమ్మూ కాశ్మీర్‌తోపాటు మరో మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు
New Update

Ink Mark to Voter Aides: దేశ వ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం(CEC) సంచలన నిర్ణయం తీసుకుంది. వృద్ధులు, వికలాంగులు తదితర ఓటర్లతో పాటు పోలింగ్ బూత్‌లకు సహాయకులగా వచ్చేవారి చేతి వేలిపై కూడా సిరా గుర్తు వేయాలని నిర్ణయించారు. అయితే, వీరికి ఎడమచేతి చూపుడు వేలికి కాకుండా.. కుడి చేతి చూపుడు వేలికి గుర్తు వేయనున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది కేంద్ర ఎన్నికల సంఘం. పోలింగ్ బూత్‌లలో పోలింగ్ ఏజెంట్లుగా గ్రామాల సర్పంచ్‌లు, వార్డు సభ్యులు కూర్చునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నట్లు ప్రకటించింది ఎన్నికల సంఘం. అలాగే, ఎన్నికల రోజున మాక్ పోలింగ్‌ను ఉదయం 5.30 గంటలకే ప్రారంభించాలని సూచించింది సీఈసీ.

కాగా, దేశ వ్యాప్తంగా మిజోరం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో నవంబర్ 7వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు డిసెంబర్ 3 వ తేదీన ప్రకటించనున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో నవంబర్ 7 న, ఛత్తీస్‌గఢ్‌లో రెండు దశల్లో పోలింగ్ జరుగనుంది. నవంబర్ 7, 17వ తేదీల్లో పోలింగ్ జరుగనుంది. ఇక మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17, రాజస్థాన్‌లో 23వ తేదీ, తెలంగాణలో నవంబర్ 30వ తేదీన ఒకే దశలో ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 5 రాష్ట్రాలకు సంబంధించి ఓట్ల టెక్కింపు డిసెంబర్ 3న ఉంటుంది. అదే రోజున ఫలితాలు వెల్లడిస్తారు.

Also Read:

అలా చేస్తే నా నిర్ణయం నేను తీసుకుంటా: హైకమాండ్ కు జగ్గారెడ్డి ఫోన్

ఒకవేళ హంగ్ వస్తే తెలంగాణ లో పరిస్థితి ఏంటి? పార్టీల ప్లాన్ బీ ఎలా ఉంటుంది?

#telangana-elections #telangana-news #telangana-politics
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe