Sajjala : సజ్జలతో పాటు ఇతర సలహాదారులు ఈసీ ఊహించని షాక్.. అలా చేస్తే వేటే!

ప్రభుత్వ సలహాదారులకు కూడా ఎన్నికల కోడ్ వర్తిస్తుందని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ప్రభుత్వ జీతభత్యాలు పొందుతున్న 40 మందికి కోడ్ వర్తిస్తుందని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.

New Update
Elections: తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ జాతర..ఇవాళ్టి నుంచే నమోదు

EC :  ప్రభుత్వ సలహాదారులకు కూడా ఎన్నికల కోడ్(Election Code) వర్తిస్తుందని ఎన్నికల కమిషన్(Election Commission) స్పష్టం చేసింది. ప్రభుత్వ జీతభత్యాలు పొందుతున్న 40 మందికి కోడ్ వర్తిస్తుందని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. నిర్దేశించిన విధులకు బదులుగా రాజకీయ జోక్యం చేసుకుంటున్నట్లు ప్రభుత్వ సలహాదారులపై ఎన్నికల కమిషన్ కు పెద్ద సంఖ్యలు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ఈసీ. ప్రతిపక్షాలను విమర్శిస్తూ మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ గుర్తించింది.

వివరణాత్మక సమీక్ష తదుపరి ప్రభుత్వ మంత్రికి వర్తించే విధంగా ఈ సలహాదారులకు కూడా ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తిస్తుందని ఈసీఐ స్పష్టంచేసింది. కమిషన్ యొక్క ఈ ఆదేశాలను ఏమాత్రం ఉల్లంఘిచినా తీవ్రంగా పరిగణిస్తూ సంబంధిత చట్టాలకు లోబడి కఠినమైన చర్యలను తీసుకోవడం కూడా జరుగుతుందని ఈసీఐ(ECI) స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్..కౌంటర్ కు వెళ్లకుండానే ట్రైన్ టికెట్..ఎలాగంటే.!

Advertisment
Advertisment
తాజా కథనాలు