Nandyala: నంద్యాల ఎస్పీ రఘువీరా రెడ్డిపై ఈసీ సీరియస్ అయింది. ఎన్నికలకోడ్ అమలు చేయడంలో విఫలమయ్యాడంటూ విచారణకు ఆదేశించింది. శాఖపరమైన విచారణ జరపాలని డీజీపీకీ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఎస్పీ రఘువీరాతోపాటు డీఎస్పీ రవింద్రనాథ్ రెడ్డి, సీఐ రాజారెడ్డిపై చర్యలు తీసుకోవాలని సూచించింది. ఆదివారం రాత్రి 7 గంటలలోపు చార్జ్ షీట్ ఫైల్ చేయాలని సీఈసీ స్పష్టం చేసింది. 144 సెక్షన్ అమల్లో ఉన్నా జన సమీకరణను అరికట్టలేకపోయారని, ఎన్నికల కోడ్ అమలు చేయడంలో విఫలమయ్యారంటూ నంద్యాల పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వీరిపై శాఖాపరమైన విచారణ జరపాలని డీజీపీకి ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
నిన్న అల్లు అర్జున్ నంద్యాలకు వచ్చిన సందర్భంగా భారీ జనం గుమికూడడం, వారిని అదుపు చేయలేకపోవడం ఈసీ ఆగ్రహానికి కారణంగా తెలుస్తోంది. ఈ అధికారులపై రాత్రి 7 గంటల్లోగా చర్యలు తీసుకోవాలని తన ఆదేశాల్లో పేర్కొంది. ఇప్పటికే అల్లు అర్జున్, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీలో ఎలక్షన్ కోడ్, సెక్షన్ 144 అమల్లో ఉండగా.. అనుమతి లేకుండా జనసమీకరణ చేయడంతో కేసు నమోదు చేశారు.