Veg Biryani : కళ్లు చెదిరే వెజిటేబుల్ బిర్యానీ(Veg Biryani) ఎవరినైనా ఆకర్షిస్తుంది. మూలం ఇరాన్ అయినప్పటికీ రుచి మాత్రమే మన భారతీయుల చేతుల్లో ఉంది. వెజిటేబుల్ బిర్యానీ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
ఇందులో తక్కువ కేలరీలు:
- వెజిటేబుల్ బిర్యానీ(Vegetable Biryani) మన ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలను(Health Benefits) కలిగిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందులో పోషకాలు అధికంగా ఉంటాయి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే వెజిటేబుల్ బిర్యానీ శరీరంలో బాగా జీర్ణమై బరువును నియంత్రణలో ఉంచుతుంది.
పోషకాలు పుష్కలం:
- వెజిటేబుల్ బిర్యానీలో విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. బీన్స్, క్యారెట్, శనగలు, రేకులు, లవంగాలు, రాతి పువ్వుల వల్ల మన శరీరానికి అనేక రకాల విటమిన్లు అందుతాయి. అదనంగా విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల మన రోగనిరోధక వ్యవస్థ కూడా బలపడుతుంది.
కొవ్వు పరిమాణం తక్కువ:
- నాన్ వెజ్ బిర్యానీ(Non-Veg Biryani) ని చూస్తే అందులో ఫ్యాట్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ వెజిటేబుల్ బిర్యానీలో వాడే కూరగాయలు తక్కువ ఫ్యాట్, తక్కువ క్యాలరీలు కలిగి ఉంటాయి.
అంతేకాకుండా దీని తయారీకి కూరగాయల నూనె ఉపయోగిస్తారు. దీని వల్ల మన శరీరానికి ఎలాంటి సంతృప్త కొవ్వు పదార్థాలు లభించవు. మంచి ప్రొటీన్ కంటెంట్ ఉన్న అద్భుతమైన వెజిటబుల్ బిర్యానీని తయారు చేసి తరచుగా తినవచ్చు.
బరువు తగ్గడానికి బెస్ట్:
- అధిక బరువు ఉన్నవారు ఈ బిర్యానీ తింటే శరీరంలో జీవక్రియ మెరుగుపడుతుంది. శరీరంలో ఉన్న అనవసర కొవ్వు కూడా బయటికి పోతుంది. దీనిలోని అధిక ఫైబర్ కంటెంట్ శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది(Weight Loss). అంతేకాకుండా శరీరానికి ఎన్నో విటమిన్లు, ఖనిజాలు అందుతాయి.
ఇది కూడా చదవండి: రెండు చేతులతో నమస్కారం చేయలేకపోతే షుగర్ ఉన్నట్టేనా?
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: షుగర్‌ను కంట్రోల్ చేసే సూపర్ డ్రింక్స్..ఇంట్లోనే సులభంగా తయారీ